హుజూర్‌నగర్: మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో క్రైమ్ రేటు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ సందీప్ గోనె తెలిపారు. సోమవారం స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును విచారించేందుకు వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గడిచిన ఏడాది కంటే ఈ ఏడాది ఇప్పటి వరకు క్రైమ్ రేటు బాగా తగ్గిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలీస్‌స్టేషన్లలో పేపర్‌లెస్ పరిపాలన పద్ధతి ఈనెల 5 నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పద్ధతి ద్వారా ఫిర్యాదులు, ఎఫ్‌ఐఆర్‌లు, పరిపాలన ఆన్‌లైన్‌లోనే కొనసాగుతుందన్నారు. ఇప్పటికే ప్రతిస్టేషన్ నుంచి ఇద్దరు సిబ్బం ది,ఎస్‌ఐలకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. సమావేశంలో సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఐలు అఖిల్‌జామా, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
క్రైమ్ రేట్ తగ్గించేందుకు చర్యలు
Published Mon, Mar 9 2015 11:50 PM | Last Updated on Sat, Aug 11 2018 8:45 PM