వేలూరు, న్యూస్‌లైన్:వేలూరు, తిరువ ణ్ణామలై జిల్లా లో శాంతిభద్రతలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని డీఐజీ తమిళ్‌చంద్రన్ తెలిపారు. వేలూరు డీఐజీగా తమిళ్‌చంద్రన్ శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేలూరు,తిరువణ్ణామలై జిల్లా లో మామూళ్లు వసూలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వేలూరులో ట్రాఫిక్ సమస్య ను పోలీసు అధికారులతో చర్చించి వాటిని మార్పుచేసేందుకు కృషి చేస్తానన్నారు. రాత్రి వేళల్లో చోరీలు అధికంగా జరుగుతున్నట్లు, పట్టణంలో కార్పొరేట్, బంగారు దుకాణాల్లో చోరీలు జరిగినప్పటికీ ఇంతవరకు సంబంధించిన వారిని అరెస్ట్ చేయలేదని అటువంటి కేసులను పరిశీలించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వాహన తనిఖీలు, రోడ్డు ప్రమాదాలపై సమీక్షించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వేలూ రు జిల్లా సరిహద్దు ప్రాంతాల ద్వారా ఎర్రచందనం, నాటు సారా ఇతర జిల్లాలకు తరలుతున్నట్లు విమర్శలున్నాయని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయనవెంట ఎస్పీ విజయకుమార్, డీ ఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.