కొనసూరి రాములు హత్యకేసులో నిందితుల అరెస్ట్
త్రివేండ్రం: మాజీ మావోయిస్టు, టీఆర్ఎస్ నేత సాంబశివుడు సోదరుడు కోనపురి రాములు హత్యకేసులో నిందితులను కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాములు హత్యకేసుతో సంబంధమున్న ఆరుగురిని పక్కా సమాచారం ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. నిందితులను త్వరలోనే హైదరాబాద్‌కు పోలీసులు తీసుకురానున్నారు.
టీఆర్‌ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడుగా సేవలందిస్తున్న మాజీ మావోయిస్టు కొనపురి రాములు మే 11 తేదిన దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఓ వివాహ వేడుకలో పాల్గొన్న రాములును దుండగులు పథకం ప్రకారం హత్య చేశారు.