న్యూఢిల్లీ: తొలి కటాఫ్ జాబితాకు గురువారమే చివరిరోజు కావడంతో ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) పరిధిలోని పలు కళాశాలలు విద్యార్థుల తో కిటకిటలాడాయి. దరఖాస్తుల కోసం విద్యార్థులు పెద్దసంఖ్యలో రావడంతో వారు నిలబడిన క్యూలు చాంతాళ్లను తలపింపజేశాయి. కాగా కొన్ని కళాశాలలు తమ సీట్ల సంఖ్యకు మించి ప్రవేశాలను స్వీకరించాయి. ఇదిలాఉంచితే డీయూ ఉత్తర ప్రాంగణంలోని కిరోరి మాల్ కళాశాలలో సాధారణ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురయ్యారు.
ఈ విషయమై ఈ కళాశాలలో ప్రవేశం కోసం వచ్చిన రసిక శర్మ మీడియాతో మాట్లాడుతూ ‘అడ్మిషన్ కోసం మూడు రోజుల క్రితం నేను, మా నాన్న ఇక్కడికి వచ్చాం. అయినప్పటికీ ఇంకా అడ్మిషన్ ఖరారు కాలేదు. పరీక్షల్లో 97 శాతం మార్కులు సాధించా. బుధవార ం అందరికంటే ముందు దరఖాస్తును కళాశాలకు అందజేసింది కూడా నేనే’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కళాశాల యాజమాన్యం తీరుపై రసిక శర్మ మండిపడ్డారు. ‘ప్రవేశ ప్రక్రియ అంతా గందరగోళంగా ఉంది. కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్‌లు తమ తమ కార్యాలయాల్లో హాయిగా, తీరిగ్గా కాలక్షేపం చేస్తున్నారు. విద్యార్థుల సమస్య లను గాలికొదిలేశార’ని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వలస తప్ప మరో మార్గమే లేదు
న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) కటాఫ్ మార్కులను విపరీతంగా పెంచడంపై బీజేపీ నాయకుడు విజయ్ గోయల్ మండిపడ్డారు. కటాఫ్ మార్కుల పెంపు వల్ల ఇక్కడి విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఇతర రాష్ట్రాలకు వలస పోవడం తప్ప మరో మార్గమే లేదన్నారు. సగటు విద్యార్థి నష్టపోక తప్పదన్నారు. ‘డీయూలో సీట్ల సంఖ్య 54 వేలు. 2.7 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సగటు విద్యార్థి పరిస్థితి ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు.
డీయూ ప్రవేశాలు శరవేగంగా సీట్ల భర్తీ ప్రక్రియ
Published Thu, Jul 3 2014 10:42 PM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM
Advertisement
Advertisement