వాట్సప్ లో క్వశ్చన్ పేపర్ లీక్ | Delhi Universities School Of Open Learning paper leaked on WhatsApp | Sakshi
Sakshi News home page

వాట్సప్ లో క్వశ్చన్ పేపర్ లీక్

Published Thu, May 28 2015 8:57 AM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM

వాట్సప్ లో క్వశ్చన్ పేపర్ లీక్

వాట్సప్ లో క్వశ్చన్ పేపర్ లీక్

న్యూఢిల్లీ: పరీక్ష ప్రారంభం కావడానికి గంట ముందు ప్రశ్నాపత్రం లీకైన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేపింది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఓపెన్ లెర్నింగ్(ఎస్ఓఎల్) బీకాం ఫైనల్ ఇయర్ ఎకనామిక్స్ పేపర్ వాట్సప్ మెసేజ్ ద్వారా బయటకు వచ్చింది. మధ్యాహ్నం 3 గంటలకు పరీక్ష ప్రారంభం కావాల్సివుండగా 2 గంటలకు పేపర్ వాట్సప్ లో వచ్చింది.

అయితే పేపర్ లీకైనట్టు వచ్చిన వార్తలను ఎస్ఓఎల్ చైర్ పర్సన్ సీఎస్ దూబే తోసిపుచ్చారు. పరీక్ష పేపర్ ను పరిశీలకుల ముందే బయటకు తీశామని, ప్రశ్నాపత్రం లీకైయ్యే ఛాన్స్ లేదన్నారు. అయితే వాట్సప్ మెసేజ్ లోని పేపర్ కు పరీక్షలో ఇచ్చిన ప్రశ్నాపత్రం సేమ్ టు సేమ్ ఉండడంతో అధికారులు ఖంగుతిన్నారు. దీనిపై స్పందించేందుకు పరిశీలకుల ప్యానల్ ఇన్ చార్జి రమేష్ గౌతమ్ నిరాకరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement