question paper leaked
-
ప్రశ్నాపత్రం లీక్.. జీరాక్స్ షాపులో లభ్యం
సాక్షి, కాకినాడ: కిర్లంపూడిలోని ఎస్వీఎస్ డిగ్రీ కాళశాల సిబ్బంది నిర్వాకంతో ఏకంగా పరీక్షకు ముందే ఏకంగా ప్రశాపత్రం లీక్ కావడం కలకలం రేపుతోంది. గీతం యూనివర్సిటీ దూరవిద్య బీఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రశాపత్రం లీక్ అయింది. ఈ పరీక్ష మంగళవారం జరగాల్సి ఉండగా.. సమీపంలోని ఓ జీరాక్స్ సెంటర్లో ప్రశాపత్రం జీరాక్స్లు లభించడం తీవ్ర కలకలం రేపింది. ప్రశ్నాపత్రం లీక్ కావడంతో గుట్టుగా పేపర్ మార్చి ఎస్వీఎస్ డిగ్రీ కళాశాల పరీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది. -
వాట్సప్ లో క్వశ్చన్ పేపర్ లీక్
న్యూఢిల్లీ: పరీక్ష ప్రారంభం కావడానికి గంట ముందు ప్రశ్నాపత్రం లీకైన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేపింది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఓపెన్ లెర్నింగ్(ఎస్ఓఎల్) బీకాం ఫైనల్ ఇయర్ ఎకనామిక్స్ పేపర్ వాట్సప్ మెసేజ్ ద్వారా బయటకు వచ్చింది. మధ్యాహ్నం 3 గంటలకు పరీక్ష ప్రారంభం కావాల్సివుండగా 2 గంటలకు పేపర్ వాట్సప్ లో వచ్చింది. అయితే పేపర్ లీకైనట్టు వచ్చిన వార్తలను ఎస్ఓఎల్ చైర్ పర్సన్ సీఎస్ దూబే తోసిపుచ్చారు. పరీక్ష పేపర్ ను పరిశీలకుల ముందే బయటకు తీశామని, ప్రశ్నాపత్రం లీకైయ్యే ఛాన్స్ లేదన్నారు. అయితే వాట్సప్ మెసేజ్ లోని పేపర్ కు పరీక్షలో ఇచ్చిన ప్రశ్నాపత్రం సేమ్ టు సేమ్ ఉండడంతో అధికారులు ఖంగుతిన్నారు. దీనిపై స్పందించేందుకు పరిశీలకుల ప్యానల్ ఇన్ చార్జి రమేష్ గౌతమ్ నిరాకరించారు.