మీ శరీరంలో ప్రొటీన్లు తగ్గాయా? తద్వారా ఏమైనా రుగ్మతలు వస్తున్నాయా? ఇకపై దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు.
తెలుగు శాస్త్రవేత్త పి.వెంకటేశ్‌కు ప్రధానమంత్రి ప్రత్యేక పురస్కారం
తిరుపతి నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: మీ శరీరంలో ప్రొటీన్లు తగ్గాయా? తద్వారా ఏమైనా రుగ్మతలు వస్తున్నాయా? ఇకపై దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. వాటికో పరిష్కార మార్గం కనిపెట్టానంటున్నారు ఢిల్లీ వర్సిటీలో రసాయన శాస్త్ర విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ పి.వెంకటేశ్. శరీరంలో ప్రొటీన్లు తగ్గినా, పెరిగినా నష్టమే. శరీరంపై గాయాలు ఏర్పడి నప్పుడు అవి మానడం కష్టమవుతుంది. అయానిక్ యాసిడ్స్ (ఓ రకమైన లవణ ద్రావణం)తో గాయాలను తగ్గించవచ్చని ఆయన చెబుతున్నారు. ఈ అంశంపై తాను చేసిన పరిశోధనతో ఆయన ప్రధానమంత్రి ప్రత్యేక పురస్కారానికి ఎంపికయ్యారు. తిరుపతిలో జరుగుతున్న 104వ సైన్స్ కాంగ్రెస్‌లో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
డెంటీస్ట్రరీలో వినూత్న ప్రయోగాలకు పురస్కారం
పశ్చిమ బెంగాల్‌కు చెందిన డాక్టర్ బిశ్వజిత్ పాల్ కోల్‌కతా యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగంలో శాస్త్రవేత్త. దంతాలకు సంబంధించిన వ్యాధులు, కట్టుడు పళ్లతో వచ్చే రుగ్మతలపై చేసిన పరిశోధనలకు గాను ఆయనకు ప్రధానమంత్రి అవార్డు లభించింది. కట్టుడు పళ్లకు ఉపయోగించే సిరామిక్స్, సిల్వర్ మెటల్స్ వంటి వాటితో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాన్ని కనిపెట్టినట్టు తెలిపారు.