న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)లో కొత్త విద్యాసంవత్సరం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ యూనివర్సిటీలో నాలుగు సంవత్సరాల అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ) ఓ చరిత్రగా మిగిలిపోయిన సంగతి విదితమే. దాని స్థానంలో మూడేళ్ల కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎటువంటి ఆటంకాలు కలుగకుండా చేసేందుకుగాను డీయూ పరిధిలోని కళాశాలలు ఇప్పటికే కొత్తగా చేరే విద్యార్థులకు పునశ్చరణ కార్యక్రమం నిర్వహించాయి. ఈ విషయమై శ్రీరాం కాలేజ్ ఆఫ్ కామర్స్ ప్రిన్సిపల్ ఎస్‌కే జైన్ మాట్లాడుతూ వివిధ కోర్సులకు సంబంధించి తాము మొత్తం 800 మంది విద్యార్థులను చేర్చుకున్నామన్నారు.
ఇవాళకూడా వారికి పునశ్చరణ తరగతులను నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా కోర్సు, టైంటేబుల్, నిబంధనావళి తదితరాలపై వారికి అవగాహన కల్పించామన్నారు. ఈ నెల 21వ తేదీనుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. టైంటేబుల్ తదితర వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. తాత్కాలిక ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు. ఇదే విషయమై మిరండా హౌస్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రతిభా జాలీ మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరం సజావుగా సాగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. కాగా నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు రద్దు వివాదం ఇటీవల కొంతకాలంపాటు తల్లిదండ్రులతోపాటు విద్యార్థులను తీవ్ర గందరగోళానికి గురిచేసిన సంగతి విదితమే.
అనేక తర్జనభర్జనలు, చర్చలు, కమిటీల నియామకం తదితరాల తర్వాత డీయూ ఈ కోర్సును రద్దుచేసి దాని స్థానంలో మూడేళ్ల కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి విదితమే. ఈ విద్యాసంవత్సరం ఎటువంటి ఆటంకాలు లేకుండాసోమవారం ప్రారంభమ వుతుందని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కళాశాల ప్రిన్సిపల్ ఎస్‌కే గార్గ్ వెల్లడించారు. కాగా ఎఫ్‌వైయూపీ వివాదం నేపథ్యంలో ఈ నెల రెండో తేదీన ప్రారంభం కావాల్సిన విద్యా సంవత్సరం 19 రోజులమేర ఆలస్యమైంది. ఎఫ్‌వైయూపీ వివాదం కారణంగా అనేకమంది విద్యార్థులు తీవ్ర ఆందో ళనకు గురయ్యారు. దీనిపై ఏడాదికాలంగా అనేక విద్యార్థి సంఘాలు ఆందోళనలను నిర్వహి స్తూనే ఉన్నాయి. చివరికి ఈ వివాదం ముగి యడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
డీయూలో కొత్త విద్యాసంవత్సరం నేటి నుంచి ప్రారంభం
Published Sun, Jul 20 2014 10:12 PM | Last Updated on Sat, Sep 2 2017 10:36 AM
Advertisement
Advertisement