ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ రాజీనామా
Published Tue, Jun 24 2014 4:32 PM | Last Updated on Sat, Sep 2 2017 9:20 AM
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ దినేశ్ సింగ్ తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు. వివాదస్పద నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్ కోర్సు రద్దు చేయాలంటూ యూజీసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దినేశ్ రాజీనామా చేయడం వార్తల్లోకి ఎక్కింది.
దినేష్ సింగ్ తన రాజీనామాను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖకు పంపారని వర్సిటీ జాయింట్ డీన్ మలయ్ నీరవ్ మీడియాకు తెలిపారు. నాలుగేళ్ల కోర్సును రద్దు చేయాలంటూ యూజీసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకున్న 2.7 లక్షల మంది పరిస్థితి గందరగోళంలో పడింది.
గత సంవత్సరం ప్రారంభించిన నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సును రద్దు చేయాలంటూ ఢిల్లీ యూనివర్సిటీకి యూజీసీ నోటీసలు జారీ చేసింది. అలాగే నాలుగేళ్ల కోర్సు కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులను మూడేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుకు మళ్లించాలని యూజీసీ ఆదేశించింది.
Advertisement