dinesh singh
-
రాహుల్.. ప్రధాని అయిపోయారట!
రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడిగా చేద్దామంటేనే ఇంకా కుదరడం లేదు. అలాంటిది సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ మాత్రం ఏకంగా ఆయనను ప్రధానమంత్రిని చేసేశారు. ఆయన మంత్రివర్గంలో ఫలానా ఆయన పనిచేశారంటూ చెప్పేస్తున్నారు!! అవును.. వయసు మీద పడటంతో జ్ఞాపక శక్తి తగ్గుతోందో.. లేదా పదాలు తడబడుతున్నాయో తెలియదు గానీ ఆయన చేస్తున్న ట్వీట్లు నెటిజన్లకు నవ్వు తెప్పిస్తున్నాయి. కాంగ్రెస్ మాజీ ఎంపీ రాజ్‌కుమారీ రత్నాసింగ్ రూపొందించిన ఒక వీడియోను దిగ్విజయ్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ వీడియో తీసింది ఎవరో వివరించే ప్రయత్నంలో ఆయన తప్పులో కాలేశారు. రత్నాసింగ్ ఎవరో కాదని.. మాజీమంత్రి దినేష్ సింగ్ కూతురని చెబుతూ.. దినేష్ సింగ్ అనే పెద్దాయన గతంలో ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ మంత్రివర్గాలలో పనిచేశారన్నారు. దినేష్ సింగ్ తండ్రి అవధ్ తాలూక్‌దార్లలో ఒకరని, ఆయన స్వాతంత్ర్య సమరంలో బ్రిటిష్ వారితో పోరాడి కాంగ్రెస్‌కు మద్దతిచ్చారని కూడా చెప్పారు. ఇందిరా గాంధీ అంటే ప్రధానమంత్రిగా పనిచేసిన విషయం అందరికీ తెలుసు గానీ.. రాహుల్ గాంధీ ఎప్పుడు ప్రధాని అయ్యారో, ఆయన దగ్గర దినేష్ సింగ్ అనే మంత్రి ఎప్పుడు పనిచేశారో దిగ్విజయ్ సింగ్‌కే తెలియాలి. నిజానికి రాజీవ్ గాంధీ అని రాయబోతూ రాహుల్ గాంధీ అని రాసేశారీ పెద్దాయన. దినేష్ సింగ్ గతంలో రాజీవ్ గాంధీ హయాంలో కూడా కేంద్రమంత్రిగా చేశారు. దిగ్విజయ్ సింగ్ మాట తడబడటం ఇది మొదటిసారి ఏమీ కాదు. గతంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ అనబోయి.. భారత ఆక్రమిత కశ్మీర్ అనేశారు. అదికూడా రెండు దేశాల మధ్య పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా ఉన్న తరుణంలో!! ఒసామా బిన్ లాడెన్‌ను 'ఒసామాజీ' అని, హఫీస్ సయీద్‌ను 'సాహెబ్' అని సంబోధించారు!! Jai Jai Gange | Akriti Kakar | Devotional | Rajkumari Ratna Singh (Kalak... Must watch Video. https://t.co/EuxZBsfTcs — digvijaya singh (@digvijaya_28) 27 March 2017 Rajkumari Ratna Singh ex MP is the daughter of Raja Dinesh Singh ji who was a Cabinet Minister in Indira Gandhi and Rahul Gandhi Cabinet. — digvijaya singh (@digvijaya_28) 27 March 2017 Dinesh Singh ji's father was one of the few Taluqdars of Audh who fought British and supported Congress in the Freedom Movement. — digvijaya singh (@digvijaya_28) 27 March 2017 -
మరో వివాదంలో డీయూ వీసీ దినేష్‌సింగ్
న్యూఢిల్లీ : ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) ఉపకులపతి దినేష్‌సింగ్ మళ్లీ మరో వివాదంలో చిక్కుకుపోనున్నారు. విశ్వవిద్యాలయంలో జరిగిన అనేక కుంభకోణాల్లో సింగ్ ప్రమేయం ఉందంటూ సీపీఎం నేత సీతారాం ఏచూరి రాసిన లేఖను కేంద్ర మానవ వనరుల శాఖ... రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పంపనుంది. కాగా నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సుపై గత ఏడాది చెలరేగిన వివాదంలో దినేష్‌సింగ్ కూరుకుపోయిన సంగతి విదితమే. రాష్ట్రపతి ఆమోదముద్ర లేనందువల్ల ఆ కోర్సును ఉపసంహరించుకోవాలంటూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ.. అప్పట్లో వీసీని ఆదేశించిన సంగతి విదితమే. తన కార్యాలయాన్ని వీసీ దుర్వినియోగం చేసిన కారణంగా విద్యార్థులు ఇబ్బందులకు గురవడమే కాకుండా, పాలనాపరంగా కూడా అనేక సమస్యలు తలెత్తాయంటూ ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకుల సంఘం (డ్యూటా) విడుదల చేసిన శ్వేతపత్రాన్ని ...సీపీఎం నేత సీతారాం ఏచూరి తన లేఖకు జత చేశారు. -
నవ్వుల పాలైన నాలుగేళ్ల డిగ్రీ
1943 సంవత్సరం నుంచి మూడేళ్ల డిగ్రీ విధానమే కొనసాగుతోంది. ఈ కోర్సును నాలుగేళ్లకు పెంచి ‘బ్రిటిష్ మోడల్’ తీసుకురావాలని 2013 విద్యా సంవత్సరంలోనే వీసీ దినేశ్‌సింగ్ తలపెట్టారు. డిగ్రీ కోర్సును నాలుగు సంవత్సరాల కోర్సుగా ‘సంస్కరించడానికి’ జరిగిన తొలి ప్రయత్నం ఇదే. ‘స్పర్ధయా వర్థతే విద్య’ అంటారు. పోటీతో విద్య వర్ధిల్లుతుందన్న ఆ నానుడి సదా సంస్కృత శ్లోకాలతో, స్వాతంత్య్రోద్యమ ఘట్టాలతో తన ఉపన్యాసాలని అలంకరించే ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) వైస్ చాన్సలర్ (వీసీ) దినేశ్‌సింగ్ తెలిసే ఉండాలి. కానీ ఆయన ఏం అర్థం చేసుకున్నారో గానీ, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఎన్‌యూను అధికార రాజకీయాల పోటా పోటీ వేదికగా మార్చడానికి దోహదపడ్డారనే అనిపిస్తుంది. ఆ విశ్వ విద్యాలయం పరిధిలో ఉన్న మూడేళ్ల వ్యవధి కలిగిన అన్ని డిగ్రీ కోర్సులను నాలుగేళ్ల కోర్సులుగా మార్చాలన్న నిర్ణయం నవ్వుల పాలయింది. విద్యార్థులు చదువులలో పోటీ పడే అవకాశమే లేకుండా, ప్రవేశాలకు ఈ అంశం పెద్ద అంతరాయంగా మారిపోయింది. దేశంలో 1943 సంవత్సరం నుంచి మూడేళ్ల డిగ్రీ విధాన మే కొనసాగుతోంది. ఈ కోర్సును నాలుగేళ్లకు పెంచి ‘బ్రిటిష్ మోడల్’ తీసుకురావాలని 2013 విద్యా సంవత్సరంలోనే వీసీ దినేశ్‌సింగ్ తలపెట్టారు. డిగ్రీ కోర్సును నాలుగు సంవత్సరాల కోర్సుగా ‘సంస్కరించడానికి’ దేశం మొత్తం మీద జరిగిన తొలి ప్రయత్నం ఇదే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నాలుగేళ్ల డిగ్రీ కోర్సుకు సమాంతరంగా ఇక్కడ కూడా నాలుగేళ్ల పరిధిలోకి డిగ్రీ కోర్సులను తీసుకురావాలన్నది దీని వెనుక ఉన్న ఉద్దేశం. అప్పుడు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేసిన సిబల్ సలహాతో దినేశ్‌సింగ్ ఈ ‘సంస్కరణ’కు శ్రీకారం చుట్టా రు. నిరుడు జరిగిన ప్రవేశాలు ఆ ప్రాతిపదికనే జరిగాయి. అప్ప టి నుంచి దీని మీద వివాదం సాగుతూనే ఉంది. కానీ ప్రభుత్వం మారిపోవడంతో డీయూకు ఇక్కట్లు ముదిరాయి. నిజానికి డిగ్రీ కాల పరిధిని నాలుగేళ్లు చేయడం మీద విశ్వ విద్యాలయ ప్రాంగణంలోనే ఏకాభిప్రాయం లేదు. ఇది 60,000 మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. బీజేపీ, ఆమ్ ఆద్మీ నాలుగేళ్ల వ్యవధికి వ్యతిరేకం. తాము అధికారానికి వస్తే నాలుగేళ్ల కోర్సును మూడేళ్ల కోర్సుగా మార్చడం తథ్యమని బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రకటించింది కూడా. డీయూ పరిధిలో ఉన్న 64 కళాశాలల మధ్య కూడా ఈ అంశం మీద ఏకాభిప్రాయం లేదు. అయితే జూన్ 24న నాలుగేళ్ల కోర్సును మూడేళ్ల కోర్సుగా మార్చవలసిందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇలా మార్చడం విద్యా విధానానికే విరుద్ధమని యూజీసీ వాదించింది. అయితే ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపక సంఘం నాలుగేళ్ల కోర్సుకు అనుకూలం. ఎంతో పటిష్టంగా ఉండే ఢిల్లీ విశ్వ విద్యాలయం అధ్యాపకుల సంఘం (డ్యూటా) యూజీసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ విషయం మీద పూర్తి స్పష్టత వచ్చే వరకు కొత్త ప్రవేశాలు నిలిపివేయాలనే డ్యూటా ప్రస్తుత అధ్యక్షురాలు నందితా నారాయణ్ కోరుతున్నారు. యూజీసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశ్వ విద్యాలయం అధ్యాపకులు పార్లమెంటు భవనం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఖాళీగా ఉన్న నాలుగు వేల అధ్యాపక ఉద్యోగాలను భర్తీ చేయకుండా, ఇలాంటి నిర్ణయాలతో ప్రభుత్వం విశ్వవిద్యా లయం స్వయం ప్రతిపత్తిని భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్న దని డ్యూటా ఆరోపిస్తున్నది. 54,000 సీట్ల భర్తీకి ఇప్పటికే 2,70,000 దరఖాస్తులు పెట్టుకున్న విద్యార్థులు ఈ పరిణామాలతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సును తిరిగి మూడేళ్లకు తగ్గించాలని యూజీసీ ఇచ్చిన ఆదేశాల మీద డ్యూటా మాజీ అధ్యక్షుడు ఆదిత్య నారాయణ్ మిశ్రా ఢిల్లీ సుప్రీం కోర్టులో సవాలు చేశారు. అయితే కోర్టు కలుగ చేసుకోవడానికి అంగీకరించలేదు. కాగా, ఈ అంశం యూజీసీకీ, విశ్వ విద్యాలయానికి మధ్య వివాదమని, తనకు సంబంధం లేదని మానవ వనరుల మంత్రి స్మృతీ ఇరానీ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఎప్పుడూ నాలుగేళ్ల వ్యవధి కోర్సుగానే ఉన్న బీటెక్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుల విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీరి కోర్సు వ్యవధిని మూడేళ్లు చేస్తే రాబోయే పరిణా మాలు తీవ్రంగానే ఉంటాయి. అధ్యాపకులు, కేంద్రం లేదా యూజీసీ, విద్యార్థులు ఎవరి దారి వారిది అన్న రీతిలో ఈ అంశం మీద తమ తమ వైఖరిని కనబరుస్తున్నారు. యూజీసీ ఆదేశాలు రాగానే వీసీ దినేశ్ సింగ్ వెంటనే వాటిని శిరసావహిస్తున్నట్టు ప్రకటించారు. డీయూ పరిధిలోని 64 కళాశాలల్లో 57 వరకు మూడేళ్ల డిగ్రీని తిరిగి ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలియచేశాయని యూజీసీ వెంటనే ప్రకటించడం విశేషం. బీజేపీ, దాని విద్యార్థి విభాగం ఏబీవీపీ, ఆప్ యూజీసీ నిర్ణయాన్ని స్వాగతించగా, కాంగ్రెస్ తొందరపా టు చర్యగా భావిస్తోంది. ఇవన్నీ చూస్తే ఒక పెద్ద విద్యా పీఠాన్ని మన రాజకీయులు నవ్వుల పాలు చేశారని చెప్పక తప్పదు. - కల్హణ -
లాంఛనంగా రద్దైన ఎఫ్‌వైయూపీ
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం (ఎఫ్‌వైయూపీ)ను ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) శనివారం లాంఛనంగా రద్దు చేసింది. దీనిని తొలగించాలన్న ప్రతిపాదనకు యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా ఆమోదం తెలిపాయి. దీంతో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ను రద్దు చేస్తున్నట్లు వైస్-చాన్స్‌లర్ దినేష్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. అత్యవసరంగా సమావేశమైన అకడమిక్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మూడేళ్ల డిగ్రీ కోర్సును అమలు చేయాలని, 2012-13 విద్యా సంవత్సరంలో అనుసరించిన పద్ధతి ప్రకారం అడ్మిషన్లు జరపాలంటూ తీర్మానించాయి. రెండు కౌన్సిళ్లు ఈ తీర్మానాన్ని భారీ మెజారిటీతో ఆమోదించినా, ఎఫ్‌వైయూపీపై మాత్రం చర్చించలేదు. అకడమిక్ కౌన్సిల్‌లోని 90 మంది సభ్యుల్లో ఎనిమిది మంది తీర్మానాన్ని వ్యతిరేకించారు. నాలుగేళ్ల కోర్సుపై డీయూ చర్చ జరపలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. చర్చ లేకుండానే అకడమిక్ కౌన్సిల్ మూడేళ్ల డిగ్రీ కోర్సుకు ఆమోదం తెలపడం దురదృష్టకరమని తీర్మానాన్ని వ్యతిరేకించిన అకడమిక్ కౌన్సిల్ సభ్యుడు సంజయ్‌కుమార్ అన్నారు. అకడమిక్ కౌన్సిల్ ఏకపక్షంగా కేవలం రెండు నిమిషాల్ల్లో తీర్మానాన్ని ఆమోదించిందని ఆయన చెప్పారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోనూ తీర్మానం భారీ మెజారిటీతో ఆమోదం పొందింది. వైస్‌చాన్స్‌లర్ దినేష్ సింగ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారని, ఐదు నిమిషాల్లో ఆమోదం లభించిందని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు ఆదిత్య నారాయణ్ మిశ్రా చెప్పారు. ఆందోళనకు దిగిన బీ.టెక్ విద్యార్థులు ఎఫ్యూవైపీని డీయూ అధికారికంగా రద్దు చేసిన నేపథ్యంలో ఈ కోర్సు చదువుతున్న బీ.టెక్, బీ.ఎంఎస్ కోర్సుల్లో చేరిన విద్యార్లుల భవితవ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా వైస్ చాన్స్‌లర్ 12 మంది కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో నియమించిన కమిటీ అడ్మిషన్ విధివిధానాలను రూపొందిస్తోంది. ఈ కమిటీయే బీ.టెక్ కోర్సు భవితవ్యంపై తుది నిర్ణయం తీసుకుంటుందని మిశ్రా చెప్పారు. ఈ కమిటీ తన సిఫార్సులను శనివారం రాత్రి ఢిల్లీ యూనివర్సిటీకి అందజేస్తుంది. వీటి ప్రకారం సోమవారం నుంచి అడ్మిషన్లు మొదలు కావచ్చని భావిస్తున్నారు. తమ కోర్సును మూడేళ్ల కోర్సుగా మార్చవద్దని డిమాండ్ చేస్తూ వందలాది మంది బీ.టెక్ విద్యార్థులు వీసీ కార్యాలయం ఎదుట శనివారం ప్రదర్శన జరిపారు. నాలుగేళల కోర్సుపై చెలరేగిన వివాదం సమసిపోవడంతో ప్రస్తుత విద్యాసంవత్సరం అడ్మిషన్లపై నెలకొన్న అనిశ్చితి తొలగిపోయిందని డీయూ అధికారి ఒకరు అన్నారు. -
ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ రాజీనామా
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ దినేశ్ సింగ్ తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు. వివాదస్పద నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్ కోర్సు రద్దు చేయాలంటూ యూజీసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దినేశ్ రాజీనామా చేయడం వార్తల్లోకి ఎక్కింది. దినేష్ సింగ్ తన రాజీనామాను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖకు పంపారని వర్సిటీ జాయింట్ డీన్ మలయ్ నీరవ్ మీడియాకు తెలిపారు. నాలుగేళ్ల కోర్సును రద్దు చేయాలంటూ యూజీసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకున్న 2.7 లక్షల మంది పరిస్థితి గందరగోళంలో పడింది. గత సంవత్సరం ప్రారంభించిన నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సును రద్దు చేయాలంటూ ఢిల్లీ యూనివర్సిటీకి యూజీసీ నోటీసలు జారీ చేసింది. అలాగే నాలుగేళ్ల కోర్సు కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులను మూడేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుకు మళ్లించాలని యూజీసీ ఆదేశించింది. -
డ్యూటాతో వీసీ భేటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయం టీచర్ల సంఘం (డ్యూటా)తో వైస్ చాన్సలర్ దినేశ్సింగ్తో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు, వేతనాలు, గైర్హాజరు తదితర అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో గత మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న అంశాలను ఈ సందర్భంగా డ్యూటా ప్రతినిధుల బృందంతో వీసీ చర్చించారు. ఈ విషయాన్ని డ్యూటా అధ్యక్షుడు నందితా నారాయణ్ తెలిపారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్కూల్ ఆఫ్ లెర్నింగ్‌లో రెగ్యులర్ (ఎస్ఓఎల్) డిగ్రీ కోర్సును కొనసాగించాలంటూ ఆందోళనకు దిగినందుకుగాను సస్పెన్షన్‌కు గురైన ఎస్ఓఎల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎన్కే అగర్వాల్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వీసీని కోరినట్టు చెప్పారు. అయితే తాము లేవనెత్తిన ఏ అంశానికీ ఆయన సరిగా స్పందించలేదన్నారు. ఇది అత్యంత దురదృష్టకరమన్నారు. వేరే సమావేశంలో అత్యవసరంగా పాల్గొనాల్సి ఉండడంతో ఆయన వెళ్లక తప్పలేదని అన్నారు. అధ్యాపకులు వీలైనంత మేర సెలవులు పెట్టకుండా చూడాలని తమను వీసీ కోరినట్టు నారాయణ్ చెప్పారు. ఇందుకు తమ సహకారం అవసరమని కూడా కోరినట్టు చెప్పారు. మరోవైపు తాము గైర్హాజరీని ఎంతమాత్రం ప్రోత్సహించడం లేదని డ్యూటా ప్రతినిధులు చెప్పారు. అంతా సవ్యంగానే సాగుతోందన్నారు. బోధన ప్రక్రియ సజావుగా సాగేవిధంగా చేసేందుకు విద్యార్థులు, అధ్యాపకుల సమ్మేళనంగా ఏర్పాటుచేసిన కమిటీ శాయశక్తులా ప్రయత్నిస్తోందన్నారు. సమావేశాలు నిరంతరంగా సాగేందుకు సంబంధించిన ప్రక్రియను డీయూ పరిపాలనా విభాగం కొనసాగిస్తుందనే ఆశాభావం తమకు ఉందన్నారు. కాగా వీసీతో జరిగిన సమావేశంలో పైన పేర్కొన్న అంశాలతోపాటు వేతనాల్లో కోతలు, పదోన్నతి నిరాకరణ తదితర అంశాలు చర్చకు వచ్చాయన్నారు. -
కుప్పకూలిన వెబ్సైట్
నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సుకు ఢిల్లీ విశ్వవిద్యాలయం చేపట్టిన అడ్మిషన్ల ప్రక్రియ రసాభాసగా మారింది. ఇందుకు కారణం ఆదివారం రాత్రి నుంచి డీయూ అధికారిక వెబ్సైట్ మొరాయించడమే. దీంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. డీయూ వైస్‌చాన్సలర్ దినేశ్‌సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశాయి. కాగా ఆన్లైన్లో దరఖాస్తులను పొందే వీలులేకపోవడంతో డీయూ పరిధిలోని కళాశాలల ప్రాంగణాలు విద్యార్థులతో కిక్కిరిసిపోయాయి. న్యూఢిల్లీ: ఆదిలోనే హంసపాదు అన్నట్టుంది ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) చేపట్టిన అడ్మిషన్ల ప్రక్రియ. తొలిరోజే వెబ్సైట్ కుప్పకూలడంతో ఆయా కేంద్రాల వ ద్ద గందరగోళం నెలకొంది. నిర్వహణాలోపం ఆందోళనలకు కూడా దారితీసింది. ఉత్తర క్యాంపస్ పరిధిలోని దౌలత్‌రాం కళాశాలలోని కేంద్రంలో సోమవారం ఉదయం దరఖాస్తులను అందజేసిన తర్వాత కూడా ప్రవేశాల కోసం వచ్చిన విద్యార్థులను లోపలికి అనుమతించలేదు. ఆగ్రహించిన విద్యార్థులంతా ఒక్కసారిగా ఆందోళనలకు దిగడంతో కళాశాల యాజమాన్యం దరఖాస్తుల విక్రయాన్ని నిలిపివేసింది. అయితే కొద్దిగంట ల త రువాత మళ్లీ విక్రయించింది. ఇక షహీద్ గురుదేవ్ తేజ్ బహదుర్ ఖల్సా కళాశాల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రవేశాల కోసం వందలాదిమంది విద్యార్థులు ఈ కళాశాలకు రావడంతో ఆ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ఉద యం తొమ్మిది గంటలనుంచి మధ్యాహ్నం ఒంటిగంటదాకా నగరంలోని 18 కేంద్రాలలో దరఖాస్తులను అందుబాటులో ఉంచారు. ఆన్లైన్లో మాత్రం ఎప్పుడైనా పొందే వీలు కల్పించారు. అయితే ఆదివారం రాత్రి నుంచే ఈ వెబ్సైట్ పనిచేయడం మానేసింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో దరఖాస్తుల కొనుగోలు కోసం విద్యార్థులంతా డీయూ పరిధిలోని వివిధ కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద పెద్దసంఖ్యలో బారులుతీరారు. దీంతో ఆయా కేంద్రాల వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ విషయమై చండీగఢ్ నుంచి నగరానికి వచ్చిన విద్యా ఆనంద్ అనే విద్యార్థి మాట్లాడు తూ వెబ్సైట్ మొరాయించింది. దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుపడడం లేదు. దీంతో నేరుగా ఇక్కడికే వచ్చి కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నా’ అని చెప్పాడు. ఎన్ఎస్యూఐ నాయకుడు లోకేశ్ చుగ్మాట్లాడుతూ గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది ఢిల్లీ వర్సిటీ తగు ఏర్పాట్లు చేయలేదని, గుడారాలు వేయలేదని, తాగునీరు అందుబాటులో లేదని విమర్శించాడు. డీయూ వెబ్సైట్ సరిగా పనిచేయకపోవడం, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురైన నేపథ్యంలో వైస్‌చాన్సలర్ దినేశ్‌సింగ్ దిష్టిబొమ్మను ఏబీవీపీ దహనం చేసింది.