కులాంతర వివాహం చేసుకుందని.. పీక పిసికేశారు! | parents held for honour killing of daughter in delhi | Sakshi
Sakshi News home page

కులాంతర వివాహం చేసుకుందని.. పీక పిసికేశారు!

Published Thu, Nov 20 2014 4:22 PM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM

కులాంతర వివాహం చేసుకుందని.. పీక పిసికేశారు!

కులాంతర వివాహం చేసుకుందని.. పీక పిసికేశారు!

దేశరాజధాని ఢిల్లీలో అత్యంత ఘోరమైన ఘటన జరిగింది. కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ప్రతిష్ఠాత్మక వెంకటేశ్వర కాలేజిలో చదువుతున్న తమ 21 ఏళ్ల కూతురిని కన్న తల్లిదండ్రులే పీక పిసికి చంపేశారు. ఇందుకు వాళ్ల బంధువు కూడా సహకరించారు. తర్వాత మృతదేహాన్ని తమ గ్రామానికి తీసుకెళ్లి అక్కడ కప్పెట్టేశారు. దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి, స్థానిక కాంగ్రెస్ కార్యకర్త అయిన జగ్మోహన్, ఆయన భార్య సావిత్రిలను పోలీసులు అరెస్టు చేశారు.

వాళ్ల కూతురు భావన (21) ఈనెల 12వ తేదీన ఆర్యసమాజంలో అభిషేక్ సేఠ్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. అతడు కేబినెట్ సెక్రటేరియట్లో అసిస్టెంట్ ప్రోగ్రామర్గా పనిచేస్తున్నాడు. భావన రాజస్థానీ యాదవ కులానికి చెందినది కాగా, అభిషేక్ పంజాబీ. ఆమెను క్షమించేశామని, పద్ధతిగా పెళ్లి చేస్తామని పిలిపించి మరీ భావనను చంపేశారని పోలీసులు తెలిపారు. వారిపై పక్కా సాక్ష్యాలు ఉండటంతో తల్లిదండ్రులను అరెస్టు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement