విద్యార్థిపై జాతివివక్ష: ఇద్దరు యువకులు అరెస్టు | Two arrested for racist remark against northeastern student | Sakshi
Sakshi News home page

విద్యార్థిపై జాతివివక్ష: ఇద్దరు యువకులు అరెస్టు

Published Sun, Apr 13 2014 8:50 PM | Last Updated on Sat, Sep 2 2017 5:59 AM

Two arrested for racist remark against northeastern student

న్యూఢిల్లీ: జాతివివక్ష చూపిస్తున్న ఆరోపణలపై ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేసిన ఘటన ఉత్తర ఢిల్లీలో చోటు చేసుకుంది.
 ఈశాన్య రాష్ట్ర విద్యార్థిపై జాతివివక్ష చూపిస్తున్నారన్న ఆరోపణపై ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. బీహార్‌కు చెందిన ఛప్రా ప్రాంత వాసులైన అమిత్‌కుమార్, ఆకాశ్‌కుమార్‌లు తనపై వివక్షపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని శనివారం అర్ధరాత్రి ఈశాన్య రాష్ట్రవాసి అయిన హేమాంగ్ హూకూప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 

ఉత్తర ఢిల్లీలో ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ ఉత్తర క్యాంపస్ సమీపంలో మౌరీస్ నగర్‌లో బాధితుడు, నిందితులు పక్కపక్క నివాసాల్లో ఉంటున్నారని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement