ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా అరెస్ట్ అప్రజాస్వామికమని విరసం నేత కల్యాణరావు అన్నారు.
విజయవాడ: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా అరెస్ట్ అప్రజాస్వామికమని విరసం నేత కల్యాణరావు అన్నారు. సాయిబాబా విడుదల కోరుతూ దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం (పీడీఎం) ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ ప్రపంచం గుర్తించిన మేధావి సాయిబాబాకు నక్సల్స్‌తో సంబంధాలు ఉన్నాయంటూ అరెస్ట్ చేయడాన్ని ఖండించారు.
అంగవైకల్యంతో బాధపడే వ్యక్తిని అరెస్ట్ చేసి చీకటి గదిలో నిర్బంధించడం అమానవీయ చర్యగా అభివర్ణించారు. అరెస్ట్ సమయంలో కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం అందించకుండా గోప్యంగా వ్యవహరించడాన్ని తప్పుబట్టారు. సాయిబాబాను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.