న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) విద్యార్థులకు శుభవార్త. ఉత్తర, దక్షిణ ప్రాంగణాల్లో అభ్యసిస్తున్న విద్యార్థులకు త్వరలో ప్రత్యేక బస్సు సేవలు అందనున్నాయి. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ప్రతినిధుల బందం కేంద్ర రోడ్డు, రవాణా శాఖ సహాయమంత్రి కిషన్‌పాల్ గుజ్జార్‌ను కలిసింది. విద్యార్థులకోసం ప్రత్యేక బస్సు సేవలు అందించాలని కోరుతూ ఆయనకు ఓ వినతిపత్రం సమర్పించింది. ఇందుకు మంత్రి కి షన్‌పాల్ సానుకూలంగా స్పందించారు. త్వరలో సేవలను ప్రారంభిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఏబీవీపీ కార ్యదర్శి రోహిత్ చహాల్ వెల్లడించారు. కాగా నగరంలోని ఆయా మెట్రో స్టేషన్ల వద్దనుంచి ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ)కి చెందిన మూడు బస్సులు ఉత్తర ప్రాంగణానికి విద్యార్థులను చేరవేస్తున్నాయి. కాగా డీయూకి అనుబంధం గా నగరంలోని వివిధ ప్రాంతాల్లో 78 అనుబంధ కళాశాలలు ఉన్నాయి.
డీయూ విద్యార్థులకు త్వరలో ప్రత్యేక బస్సు సేవలు
Published Tue, Sep 2 2014 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 12:43 PM
Advertisement