ఆస్తి వివాదాల్లాంటివాటి విషయంలో ఉచిత న్యాయ సలహాలు ఇచ్చేందుకు ఢిల్లీ విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది. గతంలో కేవలం వర్సిటీకి చెందిన వారికి మాత్రమే ఈ సేవలు అందించిన విశ్వవిద్యాలయం తాజాగా ఆ సేవలు బయటవారికి కూడా విస్తరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ వర్సిటీలోని గాంధీ భవన్, క్యాంపస్ లా సెంటర్లో ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సాయంతో (డీఎస్ఎల్ఎస్ఏ) సాయంతో వర్సిటీకి చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు మాత్రమే న్యాయ సలహాల విషయంలో ఉచిత శిక్షణను ఇస్తుంది. తాజాగా ఎవరికైనా ప్రతి శుక్రవారం మూడు గంటల నుంచి ఐదు గంటల ప్రాంతంలో ఉచితంగా న్యాయ సలహాలు, శిక్షణను ఇస్తామని పేర్కొంది.