న్యూఢిల్లీ : సస్పెన్షన్కు గురైన అయిదుగురు ఢిల్లీ యూనివర్శిటీ అధికారులపై వేటు ఎత్తివేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ శనివారం వర్శిటీ వైస్ చాన్సులర్ను కోరారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని తాను వ్యక్తిగతంగా కోరుతున్నట్లు ఆమె ట్విట్ చేశారు. కాగా స్మృతి ఇరానీ విద్యార్హత ధ్రువ పత్రాలను లీక్ చేశారంటూ అధికారులను నిన్న సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
2004 ఎన్నికల సమయంలో స్మృతి ఇరానీ ఎన్నికల అఫిడవిట్లో తాను 1996లో ఢిల్లీ యూనివర్సిటీ దూరవిద్యా విభాగం నుంచి బీఏ పూర్తి చేశానని పేర్కొన్నారు. తాజాగా జరిగిన ఎన్నికలలో దాఖలు చేసిన అఫిడవిట్లో మాత్రం తాను 1994లో ఢిల్లీ యూనివర్సిటీ దూరవిద్యా విభాగం ద్వారా బీకామ్ ప్రథమ సంవత్సరం మాత్రమే చదివినట్లు పేర్కొన్న విషయం తెలిసిందే.
వారిపై సస్పెన్షన్ ఎత్తివేయండి: స్మృతి ఇరానీ
Published Sat, May 31 2014 10:50 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement