బాస్‌తో నాన్న.. టీచర్‌-పేరెంట్‌ మీటింగ్‌! | Smriti Irani Post Photo PM Modi And Her Father Meet | Sakshi
Sakshi News home page

బాస్‌తో నాన్న.. టీచర్‌-పేరెంట్‌ మీటింగ్‌!

Published Fri, Dec 8 2023 3:58 PM | Last Updated on Fri, Dec 8 2023 4:12 PM

Smriti Irani Post Photo PM Modi And Her Father Meet - Sakshi

ఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తరచూ రాజకీయ, వ్యక్తిగత విషయాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ ఫోటో ఆసక్తికరంగా మారింది. గురువారం ఆమె తన తండ్రితో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అయితే దీనికి సంబంధించిన ఫోటో స్మృతి ఇరానీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. అదే విధంగా ఆ ఫొటోకు ఆసక్తికర కాప్షన్‌ను జతచేశారు.

బాస్‌ అయిన ప్రధాని మోదీ.. తండ్రితో కలిసి జరిగిన సమావేశాన్ని ఆమె టీచర్‌-పేరెంట్‌ మీటింగ్‌తో పోల్చారు. ఇలాంటి సమయంలో వారు పరస్పరం తన గురించి ఫిర్యాదులు చేసుకోకుండా ఉండాలని దేవున్ని పార్థిస్తున్నానని రాసుకోచ్చారు.

ఈ ఫొటోపై టీవీ ప్రొడ్యూసర్‌ ఏక్తా కపూర్‌, నటుడు సోనూసూద్‌ స్పందిస్తూ.. ‘మీరు మంచి స్టూడెంట్‌ అని పొగుడుతున్నారు’, మీ కూతురు చాలా కష్టపడే తత్వం గల మహిళ, మీరు మంచి నడవడిక నేర్పారని మోదీ అన్నట్లు’ కామెంట్లు చేశారు.

ఎంతో బీజీ షెడ్యూల్‌లో తమ తండ్రితో కలవాడానికి సమయం ఇచ్చినందుకు ఆమె ప్రధానికి మోదీకి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లో అడుగు పెట్టకముందు సినీ ఇండస్ట్రీలో తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్న స్మృతి ఇరానీ. భాజపా తరఫున ఎంపీగా గెలిచిన కేంద్రమంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement