ఆకతాయిల వేధింపులతో బాలిక ఆత్మహత్య
Published Fri, Dec 2 2016 11:52 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
హైదరాబాద్: పోకిరీల వేధింపులతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని బలవన్మరణం చెందింది. ఆల్వాల్‌లోని కేఎంఆర్ జూనియర్ కళాశాలలో ఫస్టియర్ చదువుతున్న గౌతమి(16)ను కొందరు వేధిస్తున్నారు. వారి చేష్టలను తట్టుకోలేని బాలిక గురువారం ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ మేరకు ఆమె తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు విజయ్, నాని, ఘని అనే ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Advertisement
Advertisement