
సాక్షి, హైదరాబాద్ : పూజలు చేయకుంటే భర్తకు ప్రమాదం జరుగుతుందంటూ మాయమాటలు చెప్పి ఓ వివాహిత మెడలో తాళి కట్టి బెదిరింపులకు పాల్పడ్డాడో వ్యక్తి. ఈ సంఘటన హైదరాబాద్, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మాధవ్ అనే వ్యక్తి తాను జ్యోతిష్యుడినంటూ మాయమాటలు చెప్పి కేపీహెచ్‌బీకి చెందిన ఓ వివాహితకు పరిచయమయ్యాడు. ఓ రోజు మాటల సందర్భంలో.. మహిళ జాతకంలో దోషం వల్ల ఆమెకు పక్షవాతం, భర్తకు ప్రాణాపాయం ఉందంటూ భయపెట్టాడు. ( డ్రగ్స్ కేసులో చిక్కుకున్న బడా ప్రొడ్యూసర్
భర్త లేని సమయంలో పూజ చేయాలంటూ, బాధితురాలికి మాయమాటలు చెప్పి ఆమె మెడలో తాళి కట్టాడు. తాళి కట్టిన తర్వాత ఆమె తన భార్య అంటూ డబ్బు కోసం బెదిరించాడు. అసభ్యకరమైన ఫొటోలు మెసేజ్ చేస్తూ బాధితురాలిని ఇబ్బంది పెట్టసాగాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు మాధవ్‌ను, అతడికి సహకరించిన రాఘవ్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment