లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై చార్జ్‌షీట్ దాఖలైంది. అతనితో పాటు ఆయన అసిస్టెంట్‌పై 354-ఎ, 354-సి, 354-డి,509,323, 504 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. కాగా 2020లో మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఆయనకు అసిస్టెంట్‌గా పనిచేసిన ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మాస్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు పోర్న్ వీడియోలు చూపించాడని ఆరోపించింది.
ఫిర్యాదులో ఏమందంటే..'గణేష్ మాస్టర్ నన్ను చాలా రకాలుగా వేధించాడు. అంతేకాకుండా మే, 2010లో తనతో శృంగారంలో పాల్గొనాలని గణేష్ మాస్టర్ బలవంతం చేశాడు. తాను చెప్పినట్లు చేస్తే ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి లొంగదీసుకోవాలని చూశాడు. అయనప్పటికీ తాను నిరాకరించడంతో 6నెలల్లోనే ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్‌లో సభ్యత్వం రద్దు చేయించారు.
అలాగే మాస్టర్ తన అసిస్టెంట్స్‌తో నాపై దాడి చేయించాడు. ఆ మహిళా అసిస్టెంట్లు నాన్ను కొట్టి దుర్భాషలాడారు.. నా పరువు తీశారు. ఇవన్నీ జరిగాక నేను నాన్ కాగ్నిసబుల్ కేసు నమోదు చేశాను. అనంతరం తదుపరి చర్యల కోసం లాయర్‌ని సంప్రదించాను' అని సదరు మహిళ వెల్లడించింది. కాగా రీసెంట్‌గా 'ఊ అంటావా మావ..ఊఊ అంటావా మావ సాంగ్'కు గణేష్ మాస్టరే కొరియోగ్రఫీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment