ganesh acharya
-
జిన్నాకి గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ!
విష్ణు మంచు తాజా చిత్రం 'జిన్నా'. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సిన్నీలియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య 'జిన్నా' లోని ఓ పాటకు కొరియోగ్రఫీ అందించాడట. ఈ సినిమాలోని ఓ పాటకు ఇప్పటికే ఇండియన్ మైకెల్ జాక్సన్ ప్రభుదేవ కొరియోగ్రఫీ అందించగా తాజాగా ఓ సాంగ్‌ను స్టార్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య స్టెప్స్ సమకూర్చాడు. హీరో విష్ణు, పాయల్, సన్నీలియోన్‌ల మధ్య సాగే ఓ పార్టీ సాంగ్‌కు ఆయన కొరియోగ్రఫి అందించినట్లు తెలుస్తుంది. ఎంగేజ్మెంట్ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ పాట సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ కానుంది. విష్ణు మంచుతో ఉన్న అనుబంధంతో గణేష్ ఆచార్య ఈ పాటలో కాలు కదపడం విశేషం. ఈ సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండ ప్రభుదేవ, గణేశ్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్ వంటి స్టార్ కొరియోగ్రాఫర్లతో పాటలను రూపొందించి సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవరామ్ భక్త మంచు సమర్పణలో 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ, అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై విష్ణు మంచు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అలాగే ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేతో పాటు క్రియేట్ ప్రొడ్యూసర్‌గా కోన వెంకట్ వ్యవహరిస్తుండగా.. చోటా కే నాయుడా కెమెరా మ్యాన్‌గా పని చేస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. -
లైంగిక వైధింపుల కేసు: ప్రముఖ కొరియోగ్రాఫర్‌పై చార్జ్‌షీట్
లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై చార్జ్‌షీట్ దాఖలైంది. అతనితో పాటు ఆయన అసిస్టెంట్‌పై 354-ఎ, 354-సి, 354-డి,509,323, 504 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. కాగా 2020లో మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఆయనకు అసిస్టెంట్‌గా పనిచేసిన ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మాస్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు పోర్న్ వీడియోలు చూపించాడని ఆరోపించింది. ఫిర్యాదులో ఏమందంటే..'గణేష్ మాస్టర్ నన్ను చాలా రకాలుగా వేధించాడు. అంతేకాకుండా మే, 2010లో తనతో శృంగారంలో పాల్గొనాలని గణేష్ మాస్టర్ బలవంతం చేశాడు. తాను చెప్పినట్లు చేస్తే ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి లొంగదీసుకోవాలని చూశాడు. అయనప్పటికీ తాను నిరాకరించడంతో 6నెలల్లోనే ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్‌లో సభ్యత్వం రద్దు చేయించారు. అలాగే మాస్టర్ తన అసిస్టెంట్స్‌తో నాపై దాడి చేయించాడు. ఆ మహిళా అసిస్టెంట్లు నాన్ను కొట్టి దుర్భాషలాడారు.. నా పరువు తీశారు. ఇవన్నీ జరిగాక నేను నాన్ కాగ్నిసబుల్ కేసు నమోదు చేశాను. అనంతరం తదుపరి చర్యల కోసం లాయర్ని సంప్రదించాను' అని సదరు మహిళ వెల్లడించింది. కాగా రీసెంట్గా 'ఊ అంటావా మావ..ఊఊ అంటావా మావ సాంగ్'కు గణేష్ మాస్టరే కొరియోగ్రఫీ చేశారు. -
'ఊ అంటావా పాటకు కొరియోగ్రఫీ చేయననుకున్నా'
'పుష్ప.. పుష్పరాజ్.. నీ యవ్వ తగ్గేదేలే..' ఈ డైలాగ్ వల్లించడం ఒక్కటే కాదు.. 'చూపే బంగారమాయెనా.. శ్రీవల్లి..' అంటూ 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ వేసిన హుక్ స్టెప్పు వేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు సెలబ్రిటీలు. ఇదే సినిమాలోని 'ఊ అంటావా మావా ఉఊ అంటావా మావా..' పాటకు వస్తున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సమంత పర్ఫామ్ చేసిన ఈ పాట దేశమంతా మార్మోగిపోతోంది. ఇందులో సమంతకు స్టెప్పులు నేర్పించింది మరెవరో కాదు బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'తెలుగులో సరైనోడు, డీజే సినిమాలకు కొరియోగ్రఫీ చేశాను. పుష్పలో దాక్కో దాక్కో మేక సాంగ్ కూడా నేనే చేశాను. ఆ తర్వాత వేరే పని మీద నేను బిజీ అయ్యాను. డిసెంబర్ 17న రిలీజ్ అన్నారు. అదే నెలలో రెండో లేదా మూడో తారీఖుకో నాకు అల్లు అర్జున్ ఫోన్ చేసి.. మాస్టర్జీ ఒక సాంగ్ చేయాలన్నారు. చాలా తక్కువ టైమ్ ఉంది, అందులోనూ ఆ మరుసటి రోజే నాకు కంటికి ఒక సర్జరీ చేయించుకోవాల్సింది ఉండటంతో కుదరకపోవచ్చని చెప్పాను. వెంటనే పుష్ప నిర్మాతలు డాక్టర్‌కు ఫోన్ చేసి మరో డేట్ సెట్ చేసి నన్ను రమ్మని ఆహ్వానించారు. అలా రెండు రోజుల పాటు రిహార్సల్స్ చేసి ఆ తర్వాత సాంగ్ షూట్ చేశాం. సమంతకు నేను కొరియోగ్రఫీ చేయడం ఇదే తొలిసారి. ఆమె చాలా నర్వస్‌గా ఉంది. ఎందుకంటే ఈ పాటను అనుకోవడం, అందుకు సమంతను ఒప్పించడం చకచకా జరిగిపోయింది. ఈ సాంగ్‌కు నేనే డ్యాన్స్ మాస్టర్ అని అప్పటివరకు ఆమెకు తెలీనే లేదు. నాకు వల్గర్ స్టెప్స్ వేయించబుద్ధి కాదు, కాకపోతే కొంత డిఫరెంట్‌గా, ఆటిట్యూడ్ కనిపించేలా స్టెప్పులేయించాను' అని చెప్పుకొచ్చాడు గణేశ్ ఆచార్య. -
98 కిలోలు ఎలా తగ్గాడబ్బా?
ముంబై: బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకుడు గణేశ్ ఆచార్య ఏకంగా 98 కిలోల బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచారు. కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఏబీసీడీ చిత్రంలో గణేష్ నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో అయన భారీ శరీరంతో కనిపించారు. అయితే ఆ సమయంలో ఆయన దాదాపు 200 కిలోల బరువు ఉన్నారంట. ఇటీవల ప్రముఖ కపిల్ శర్మ కామెడీ షోకు అథితిగా వచ్చిన ఆయన ఏడాదిన్న కాలంలో 98 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించారు. అయితే ఇదంతా అంత ఈజీగా జరగలేదని, ఈ ఏడాదిన్నర కాలంలో ఒక్కరోజు కూడా జిమ్ మానకుండా కఠిన కసరత్తులు చేసి తగ్గానని చెప్పుకొచ్చారు. అంతేగాక 2015లో తను నటించిన ‘హే బ్రో’ సినిమా కోసం కూడా దాదాపు 40 కిలోల బరువు తగ్గినట్లు చెప్పారు. కాగా బాలీవుడ్లో గణేశ్ ఆచార్య కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్, గోవింద, అజయ్ దేవగన్ వంటి సూపర్ స్టార్లకు ఆయన కొరియోగ్రాఫి అందించారు. ఈ క్రమంలో 2018లో ‘టాయ్‌లెట్’ సినిమాలోని ‘గోరీ తూ లాత్ మార్’ పాటకు పని చేసిన ఆయన బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డును అందుకున్నారు. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య అసభ్యంగా ప్రవర్తించారు..
ముంబై : ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య తనను లైంగికంగా వేధించాడని మరో మహిళ జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ)కు ఫిర్యాదు చేశారు. గణేష్ ఆచార్య తనను లైంగికంగా వేధించాడని గతవారం మహిళా కొరియోగ్రాఫర్ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన క్రమంలో మరో మహిళ ఇదే తరహా ఆరోపణలతో ముందుకు రావడం గమనార్హం. 1990లో ముంబైలోని అంథేరిలోని సహిబా హాల్‌కు తాను వెళుతుండగా అక్కడ పలువురు మాస్టర్లు డ్యాన్స్ క్లాసులు తీసుకునేవారని, కమల్ మాస్టార్జీ వద్ద ఆచార్య అసిస్టెంట్‌గా పనిచేసేవాడని బాధిత మహిళ చెప్పుకొచ్చారు. అప్పట్లో తనకు 18 సంవత్సరాల వయసుండేదని, నాన్ మెంబర్ డ్యాన్సర్‌గా పనిచేశానని చెప్పారు. ఓ రోజు ఆచార్య లైవ్ క్లాస్‌ల పేరుతో తనను హోటల్‌కు పిలిపించి లైంగిక దాడికి యత్నించాడని, తన ఇష్టానికి వ్యతిరేకంగా తన శరీరాన్ని అభ్యంతరకరంగా తాకాడని ఆరోపించారు. పెళ్లి చేసుకుంటానంటూ మభ్యపెడుతూ అసభ్యకరంగా వ్యవహరించాడని, తాను పీరియడ్స్‌లో ఉన్నట్టు చెప్పగానే విడిచిపెట్టాడని వాపోయారు. గణేష్ ఆచార్య తనను లైంగికంగా వేధించాడని, తనకు వచ్చిన పనిపై కమిషన్లు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చేవాడని 33 ఏళ్ల మహిళా డ్యాన్సర్ గత వారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా తనపై ఇద్దరు మహిళలు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను గణేష్ ఆచార్య తోసిపుచ్చారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే వారు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వారు పరిశ్రమలో కార్మిక సంఘాలను తమ చెప్పుచేతుల్లో ఉంచుకునేందుకు ప్రయత్నించాడాన్ని తాను వ్యతిరేకించినందుకే చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తనపై ఎన్ని కుట్రలు పన్నినా తాను భయపడనని మిడ్డేతో మాట్లాడుతూ ఆచార్య అన్నారు. ఇక గణేష్ ఆచార్యను బహిష్కరించాలని బాలీవుడ్ పరిశ్రమను నటి తనుశ్రీ దత్తా ఇటీవల కోరిన సంగతి తెలిసిందే. చదవండి : అశ్లీల వీడియోలు చూడమనలేదు -
అశ్లీల వీడియోలు చూడమనలేదు
స్టార్ కొరియోగ్రాఫర్,ఐఎఫ్‌టీసీఏ(ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్ అసోసియేషన్) ప్రధాన కార్యదర్శి గణేశ్ ఆచార్య తనపై వస్తున్న వేధింపుల ఆరోపణలపై స్పందించాడు. ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశాడు. తనపై అసత్య నేరాన్ని మోపుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముంబైకి చెందిన ముప్పైమూడేళ్ల మహిళా కొరియోగ్రాఫర్.. గణేశ్ తనను లైంగికంగా వేధించాడంటూ జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన విషయం తెలసిందే. ఈ స్టార్ కొరియోగ్రాఫర్ తనకొచ్చే ఆదాయంలో కమీషన్ కావాలని బెదిరించేవాడంది. అంతేకాక అశ్లీల వీడియోలు చూడాలని తనను బలవంతపెట్టేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం అతని వల్ల ఉద్యోగం కూడా కోల్పోయానని వాపోయింది. దీనిపై స్పందించిన గణేశ్ ‘నాపై వస్తున్న ఆరోపణలు ఏమాత్రం నిజం కావు. నేను 2007లో పనిచేసిన బృందంలో ఆమె కూడా ఓ సభ్యురాలు. అంతకుమించి ఆమె గురించి నాకేమీ తెలియదు. ఓరోజు ఆమె ఇద్దరు వ్యక్తులతో గొడవకు దిగడానికి ముందే నేను షూటింగ్‌కు వెళ్లిపోయాను. తనకు అశ్లీల వీడియోలు చూడమని చెప్పడం అబద్ధం. ఆమె చెప్తున్నవన్నీ నిరాధారమైనవి’ అని పేర్కొన్నాడు. ఆమె ఆదాయంలో వాటా కావాలన్న వ్యాఖ్యలను సైతం ఆయన ఖండించాడు. తానెందుకు ఆమె ఆదాయంలో కమీషన్ కోరుతానని అసహనం వ్యక్తం చేశాడు. గతంలో బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా, సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ సైతం గణేశ్‌పై ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనతో బాలీవుడ్లో మరోసారి క్యాస్టింగ్ కౌచ్ ప్రకంపనలు మొదలయ్యాయి. చదవండి: మహిళా కొరియోగ్రాఫర్‌కు లైంగిక వేధింపులు.. -
‘ఆ కొరియోగ్రాఫర్‌ను దూరం పెట్టాలి’
ముంబై : మహిళా కొరియోగ్రాఫర్‌ను లైంగిక వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యను బహిష్కరించాలని బాలీవుడ్ భామ తనుశ్రీ దత్తా సినీ పరిశ్రమను కోరారు. బాలీవుడ్ సహా ఇతర సినీ పరిశ్రమలు గణేష్ ఆచార్యను పూర్తిగా బహిష్కరించాల్సిన సమయం ఇదేనని ఆమె పేర్కొన్నారు. పురుష సూపర్స్టార్లతో పనిచేస్తూ మహిళా డ్యాన్సర్లు, నటులను వేధిస్తున్న అతడికి బుద్ధి చెప్పాలని అన్నారు. పరిశ్రమలో తన హోదాను అడ్డుపెట్టుకుని వర్థమాన నటీమణులు, కొరియాగ్రాఫర్లను గణేష్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. హార్న్ ఓకే ప్లీజ్ సెట్లో తాను ఎదుర్కొన్న వేధింపుల్లో గణేష్ ఆచార్య పాత్ర కూడా ఉన్నప్పటికీ ఆ తర్వాత తన ప్రతిష్టను దెబ్బతీసేలా దుష్ప్రచారం సాగించాడని గతంలో తాను చేసిన మీటూ ఆరోపణలను ప్రస్తావిస్తూ ఆమె పేర్కొన్నారు. హార్న్ ఓకే ప్లీజ్ సెట్లో తాను ఎదుర్కొన్న వేధింపులు, భయాందోళన పరిశ్రమను వీడేలా చేశాయని వీటితో తాను ఎదుర్కొన్న మానసిక, ఆర్థిక సమస్యలను ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కారుపైనా వారు దాడి చేశారని, వారు నా కారును మాత్రమే ధ్వంసం చేయలేదని..నా మానసిక స్థైర్యాన్ని, స్ఫూర్తినీ దెబ్బతీశారని అన్నారు. చదవండి : వేధింపులు చిన్న మాటా! -
మహిళా కొరియోగ్రాఫర్‌కు లైంగిక వేధింపులు..
ముంబై : మహిళా కొరియోగ్రాఫర్‌ను అశ్లీల చిత్రాలు చూడాలని ఒత్తిడి చేస్తూ, లైంగిక వేధింపులకు లోనుచేస్తున్నాడనే ఆరోపణలపై కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై ముంబై పోలీసులకు ఫిర్యాదు అందింది. మహారాష్ట్ర మహిళా కమిషన్, అంబోలి పోలీస్ స్టేషన్లలో గణేష్ ఆచార్యపై 33 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేశారు. ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ (ఐఎఫ్‌టీసీఏ) ప్రధాన కార్యదర్శి కూడా అయిన గణేష్ ఆచార్య తన ఆదాయంలో కమీషన్ ఇవ్వాలని కోరేవాడని, అశ్లీల వీడియోలు చూడాలని ఒత్తిడి చేసేవాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐఎఫ్‌టీసీఏ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత గణేష్ ఆగడాలు మితిమీరాయని వాపోయారు. గణేష్ కోరికను తిరస్కరించడంతో ఆయన తన పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ తన ఐఎఫ్‌టీసీఏ సభ్యత్వాన్ని తొలగించారని ఆరోపించారు. తనకు పని ఇవ్వరాదని ఇతర కొరియోగ్రాఫర్లకు గణేష్ లేఖలు రాశారని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ సైతం గణేష్ ఆచార్య డ్యాన్సర్లను వేధిస్తున్నారని ఆరోపించడం గమనార్హం. తనపై గణేష్ వదంతులు ప్రచారం చేశారని తనుశ్రీ దత్తా ఆరోపించారు. నానా పటేకర్‌తో పాటు గణేష్‌పైనా ఆమె ఆరోపణలు గుప్పించారు. 2008లో నిర్మించిన హార్న్ ఓకే ప్లీజ్ మూవీకి గణేష్ ఆచార్య కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఈ మూవీ సాంగ్ చిత్రీకరణ సమయంలోనే నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. చదవండి : డబ్బులు ఇవ్వకుంటే లైంగిక దాడి కేసు పెడతా! -
తనుశ్రీకి పిచ్చి పట్టింది
ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలపై బాలీవుడ్లో ఇప్పటికీ వాడి వేడి చర్చ జరుగుతూనే ఉంది. కొందరు తనుశ్రీకి మద్దతుగా నిలిస్తే.. మరికొందరు నానాకి సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. నటి రాఖీ సావంత్ కూడా ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో నానాకి మద్దతుగా మాట్లాడారు. ‘‘నానా పటేకర్, గణేశ్ ఆచార్యపై వస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలు. నాకు మహిళలపై గౌరవం ఉంది. వారి గురించి తప్పుగా మాట్లాడాలన్నది నా ఉద్దేశం కాదు. తనుశ్రీకి పిచ్చి పట్టింది. పదేళ్లుగా కోమాలో ఉండి ఈ మధ్యే బయటికి వచ్చింది. పదేళ్ల తర్వాత అమెరికా నుంచి వచ్చిన తనుశ్రీ అవకాశాలు లేక.. డబ్బుల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోంది. నానాని తప్పుపడుతోంది’’ అన్నారు. రాఖీ సావంత్ వ్యాఖ్యలపై తనుశ్రీ ఫైర్ అయ్యారు. ఆమెపై రూ.10 కోట్లు పరువు నష్టం దావా వేశారు. ఈ వివాదం ఎంతవరకూ వెళుతుందో చూడాలి. -
తనుశ్రీ ఆరోపణలపై స్పందించిన గణేష్ ఆచార్య
ముంబై: బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలపై ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య స్పందించారు. తనుశ్రీ ఆరోపణల్లో నిజం లేదని ఆయన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. తనుశ్రీ మాట్లాడుతూ.. హార్న్ ఒకే ప్లీజ్ చిత్రంలో ఓ సోలో సాంగ్ చిత్రీకరణ సమయంలో కొరియోగ్రాఫర్‌ను పక్కకుబెట్టి.. నానా పటేకర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని తెలిపారు. అది సోలో సాంగ్ అయినప్పటికీ.. అందులో అతనితో సన్నిహితంగా నటించాలని నానా పటేకర్ తనను లైంగిక వేధించినట్టు ఆమె ఆరోపించారు. తాను దానికి అంగీకరించలేదని తెలిపారు. ఆ సమయంలో నానా పటేకర్ రాజకీయ పార్టీలకు చెందిన కొందరిని పిలిచి సెట్లో గొడవకు కూడా దిగాడని ఆమె పేర్కొన్నారు. అందువల్ల తాను ఆ చిత్రం నుంచి తప్పుకున్నానని అన్నారు. కాగా, ఆ చిత్రానికి కొరియోగ్రఫీ అందించిన గణేష్ ఆచార్య మాట్లాడుతూ.. తనుశ్రీ ఆరోపణల్లో నిజం లేదన్నారు. అది చాలా పాత విషయమని.. అందువల్ల ఆ సాంగ్ తనకు అంతగా గుర్తుకు లేదని తెలిపారు. తనకు గుర్తున్నంత వరకు అది సోలో కాదని.. డ్యూయేట్ సాంగ్ అని వెల్లడించారు. ఆ రోజు ఏదో జరగడం వల్ల షూటింగ్ మూడు గంటల పాటు నిలిచిపోయిందని తెలిపారు. అక్కడ అపార్థం చేసుకోవడం వల్ల ఏదో జరిగిందని.. కానీ తనుశ్రీ చెప్పినట్టుగా నానా పటేకర్ అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ, రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులను తీసుకువచ్చి సెట్లో దాడికి దిగడం కానీ జరగలేదని పేర్కొన్నారు. షూటింగ్లో అలా ఎప్పుడూ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘చిత్ర నిర్మాతలు రిహార్సల్ అప్పుడే నానా పటేకర్ కూడా ఆ సాంగ్‌లో ఉన్నారని నాతో చెప్పారు. ఆ సమయంలో నాకు చిత్ర యూనిట్‌తో ఎలాంటి ఒప్పందం లేదు.. ఎందుకంటే అప్పట్లో నేను మాట మీదే పనిచేశాను. అయినా ఆ పాటలో ఎలాంటి అసభ్యకరమైన దృశ్యాలు లేవు.. అది పూర్తిగా డ్యాన్స్‌తో కూడిన పాట’ అని అన్నారు. ఆ సాంగ్ షూటింగ్ నుంచి తనుశ్రీ వెళ్లిపోవడంతోనే రాఖీ సావంత్ తీసుకువచ్చారనే దానిపై స్పందిస్తూ.. అది పూర్తిగా నిర్మాతల నిర్ణయమేనని తెలిపారు. అంతేకాకుండా నానా పటేకర్ చాలా మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. తనుశ్రీ ఆరోపించినట్టు ఆయన ఏనాడూ ప్రవర్తించలేదని అన్నారు. నానా పటేకర్ చిత్ర పరిశ్రమలో ఎంతో మందికి సహాయం చేశారని తెలిపారు. -
200 కేజీల నుంచి 85 కేజీలకు తగ్గిన సెలబ్రిటీ
ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య కొత్తగా దర్శనమిచ్చారు. ఆయన లుక్ పాత గణేశ్‌ను మరిపించేస్తోంది. భారీ కాయంతో నిన్నమొన్నటి వరకూ కనిపించిన ఆచార్య.. దాదాపు 115 కిలోల బరువు తగ్గి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. బరువు తగ్గడంపై మాట్లాడిన ఆచార్య ఏమన్నారంటే.. దాదాపు ఏడాదిన్నర కాలం పాటు శ్రమించిన తర్వాత నా బాడీ ఇలా తయారైంది. దాదాపు 200 కేజీల వరకూ బరువు పెరిగాను. చాలా కష్టపడ్డాను. ఆ తర్వాతే శ్రమకు తగిన ఫలితం లభించింది. నాలోని కొత్తదనాన్ని చూపించేందుకు బరువు తగ్గాను. ప్రస్తుతం నా బరువు 85 కిలోలు. డ్యాన్స్ చేస్తున్నప్పుడు అప్పటికి ఇప్పటికి తేడా స్పష్టం తెలుస్తోంది. ఇప్పుడు చాలా కంఫర్టబుల్‌గా డ్యాన్స్ చేయగలుగుతున్నా. త్వరలోనే నా ట్రాన్స్ఫర్మేషన్కు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో పెడతానని చెప్పారు ఆచార్య. భాగ్ మిల్కా భాగ్ సినిమాలో మస్తాన్ కా ఝుండ్ పాటకు కొరియోగ్రఫీ చేసిన ఆచార్యకు జాతీయ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.