Choreographer Ganesh Acharya Comments On Samantha And Pushpa Oo Antava Oo Oo Antava Song - Sakshi
Sakshi News home page

Ganesh Acharya: 'ఆ రోజు సర్జరీ, ఊ అంటావా పాటకు కొరియోగ్రఫీ చేయననుకున్నా, కానీ బన్నీ ఫోన్‌తో'

Published Tue, Feb 1 2022 10:35 AM | Last Updated on Tue, Feb 1 2022 4:31 PM

Choreographer Ganesh Acharya Comments On Samantha, Oo Antava Oo Oo Antava Song - Sakshi

అల్లు అర్జున్‌ ఫోన్‌ చేసి.. మాస్టర్‌జీ ఒక సాంగ్‌ చేయాలన్నారు. చాలా తక్కువ టైమ్‌ ఉంది, అందులోనూ ఆ మరుసటి రోజే నాకు కంటికి ఒక సర్జరీ చేయించుకోవాల్సింది ఉండటంతో కుదరకపోవచ్చని చెప్పాను.

'పుష్ప.. పుష్పరాజ్‌.. నీ యవ్వ తగ్గేదేలే..' ఈ డైలాగ్‌ వల్లించడం ఒక్కటే కాదు.. 'చూపే బంగారమాయెనా.. శ్రీవల్లి..' అంటూ 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్‌ వేసిన హుక్‌ స్టెప్పు వేస్తూ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నారు సెలబ్రిటీలు. ఇదే సినిమాలోని 'ఊ అంటావా మావా ఉఊ అంటావా మావా..' పాటకు వస్తున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సమంత పర్ఫామ్‌ చేసిన ఈ పాట దేశమంతా మార్మోగిపోతోంది. ఇందులో సమంతకు స్టెప్పులు నేర్పించింది మరెవరో కాదు బాలీవుడ్‌ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ ఆచార్య.

తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'తెలుగులో సరైనోడు, డీజే సినిమాలకు కొరియోగ్రఫీ చేశాను. పుష్పలో దాక్కో దాక్కో మేక సాంగ్‌ కూడా నేనే చేశాను. ఆ తర్వాత వేరే పని మీద నేను బిజీ అయ్యాను. డిసెంబర్‌ 17న రిలీజ్‌ అన్నారు. అదే నెలలో రెండో లేదా మూడో తారీఖుకో నాకు అల్లు అర్జున్‌ ఫోన్‌ చేసి.. మాస్టర్‌జీ ఒక సాంగ్‌ చేయాలన్నారు. చాలా తక్కువ టైమ్‌ ఉంది, అందులోనూ ఆ మరుసటి రోజే నాకు కంటికి ఒక సర్జరీ చేయించుకోవాల్సింది ఉండటంతో కుదరకపోవచ్చని చెప్పాను.

వెంటనే పుష్ప నిర్మాతలు డాక్టర్‌కు ఫోన్‌ చేసి మరో డేట్‌ సెట్‌ చేసి నన్ను రమ్మని ఆహ్వానించారు. అలా రెండు రోజుల పాటు రిహార్సల్స్‌ చేసి ఆ తర్వాత సాంగ్‌ షూట్‌ చేశాం. సమంతకు నేను కొరియోగ్రఫీ చేయడం ఇదే తొలిసారి. ఆమె చాలా నర్వస్‌గా ఉంది. ఎందుకంటే ఈ పాటను అనుకోవడం, అందుకు సమంతను ఒప్పించడం చకచకా జరిగిపోయింది. ఈ సాంగ్‌కు నేనే డ్యాన్స్‌ మాస్టర్‌ అని అప్పటివరకు ఆమెకు తెలీనే లేదు. నాకు వల్గర్‌ స్టెప్స్‌ వేయించబుద్ధి కాదు, కాకపోతే కొంత డిఫరెంట్‌గా, ఆటిట్యూడ్‌ కనిపించేలా స్టెప్పులేయించాను' అని చెప్పుకొచ్చాడు గణేశ్‌ ఆచార్య.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement