ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య కొత్తగా దర్శనమిచ్చారు. ఆయన లుక్ పాత గణేశ్‌ను మరిపించేస్తోంది. భారీ కాయంతో నిన్నమొన్నటి వరకూ కనిపించిన ఆచార్య.. దాదాపు 115 కిలోల బరువు తగ్గి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు.
బరువు తగ్గడంపై మాట్లాడిన ఆచార్య ఏమన్నారంటే.. దాదాపు ఏడాదిన్నర కాలం పాటు శ్రమించిన తర్వాత నా బాడీ ఇలా తయారైంది. దాదాపు 200 కేజీల వరకూ బరువు పెరిగాను. చాలా కష్టపడ్డాను. ఆ తర్వాతే శ్రమకు తగిన ఫలితం లభించింది. నాలోని కొత్తదనాన్ని చూపించేందుకు బరువు తగ్గాను. ప్రస్తుతం నా బరువు 85 కిలోలు.
డ్యాన్స్ చేస్తున్నప్పుడు అప్పటికి ఇప్పటికి తేడా స్పష్టం తెలుస్తోంది. ఇప్పుడు చాలా కంఫర్టబుల్‌గా డ్యాన్స్ చేయగలుగుతున్నా. త్వరలోనే నా ట్రాన్స్‌ఫర్‌మేషన్‌కు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో పెడతానని చెప్పారు ఆచార్య. భాగ్ మిల్కా భాగ్ సినిమాలో మస్తాన్ కా ఝుండ్ పాటకు కొరియోగ్రఫీ చేసిన ఆచార్యకు జాతీయ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.
200 కేజీల నుంచి 85 కేజీలకు తగ్గిన సెలబ్రిటీ
Published Fri, Jul 7 2017 4:30 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 PM
Advertisement
Advertisement