మాల్దీవుల్లో భారత హై కమిషనర్ కారుపై దాడి | Indian High Commissioner Rajeev Shahare's car damaged in Male | Sakshi
Sakshi News home page

మాల్దీవుల్లో భారత హై కమిషనర్ కారుపై దాడి

Published Mon, Oct 28 2013 9:59 PM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM

Indian High Commissioner Rajeev Shahare's car damaged in Male

మాలే: మాల్దీవుల్లో భారత హైకమిషనర్ రాజీవ్ షహారే కారుపై రాళ్ల దాడి జరిగింది. మాల్దీవుల రాజధాని మాలేలో ఆయన కారుపై గుర్తుతెలియని దుండగులు రాళ్లు రువ్వారు. అయితే ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. అమీర్ అహ్మద్ మాగులోని హైకమిషనర్ కార్యాలయం ఎదుట కారు పార్క చేసివుండగా సాయంత్రం 6.45 గంటలకు(స్థానిక కాలమానం) ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.

ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు కారుపై రాళ్లు రువ్వినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానితుల సమాచారం తెలిస్తే తమకు తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement