మాల్దీవుల రాజధాని మాలెలో భారత రాయబారి రాజీవ్ షహరి వాహనంపై నిన్న సాయంత్రం ఆగంతకులు రాళ్ల దాడిని ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ తీవ్రంగా ఖండించారు. ఆ ఘటన వెంటనే విచారణ చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ ఘటనకు పాల్పడిన ఆగంతకుల చర్యను మతిలేని చేష్టలుగా వ్యాఖ్యానించారు.
మాలెలోని భారత రాయబార కార్యాలయం వెలుపల ఆగి ఉన్న రాజీవ్ షహరి వాహనంపైన మొటర్ సైకిల్పై ఇద్దరు వ్యక్తులు వచ్చి రాళ్ల దాడి చేశారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అయితే ఆ ఘటనలో ఎవరు గాయపడలేదని, కానీ రాళ్ల దాడితో కిటికి అద్దాలు పగిలిపోయాయని, అలాగే కారు ధ్వంసమైందని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.