
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో భారత హైకమిషనర్‌గా 1987 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి అజయ్ బిసారియా నియమితుల య్యారు. ప్రస్తుతం పోలెండ్‌లో భారత రాయబారిగా ఉన్న అజయ్ త్వరలోనే విధుల్లో చేరతారని విదేశాంగ శాఖ బుధవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది. పాక్‌లో భారత హైకమిషనర్‌గా పనిచేస్తున్న గౌతమ్ బంబావలే ఇటీవల చైనా రాయబారిగా వెళ్లిన నేపథ్యంలో.. అజయ్ పాక్‌లో భారత హైకమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఢిల్లీలోని ఫారిన్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన అనంతరం అజయ్ రష్యన్ భాషను స్పెషలైజేషన్‌గా ఎంచుకున్నారు.