గురుద్వారాని సందర్శించి..పూజలు చేసిన కింగ్‌ చార్లెస్‌: వీడియో వైరల్‌ | King Visits Gurdwara Met Volunteers Who Run Luton Sikh Soup Kitchen | Sakshi
Sakshi News home page

Viral Video: గురుద్వారాని సందర్శించి..పూజలు చేసిన కింగ్‌ చార్లెస్‌

Published Wed, Dec 7 2022 5:31 PM | Last Updated on Wed, Dec 7 2022 5:31 PM

King Visits Gurdwara Met Volunteers Who Run Luton Sikh Soup Kitchen  - Sakshi

బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌ లండన్‌కి 30 కి.మీ దూరంలో లూటన్‌ అనే పట్టణంలో కొత్తగా నిర్మించిన గురుద్వారాను సందర్శించారు. అక్కడ పూజలు చేసి భక్తులతో మమేకమయ్యారు. ఈ మేరకు గురద్వారాకు విచ్చేసిన ప్రిన్స్‌ చార్లెస్‌కు వివిధ మతాలకు చెందిన పిల్లలు సిక్కు జెండాలతో స్వాగతం పలికారు. అక్కడ పిండివంటలు తయారు చేసే పాకశాలను, అక్కడ పనిచేసే వాలంటీర్లను కలిశారు.

వారానికి ఏడు రోజులు, ఏడాదిలో 365 రోజులు గురుద్వారా శాఖాహారంతో కూడిని వేడి వేడి భోజనాన్ని అందిస్తుంది. కోవిడ్‌ మహమ్మారీ సమయంలో వారు చేసిన సేవలను కూడా ఎంతగానే కొనియాడారు. ఈ గురద్వార్‌లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ క్లినిక్‌ని నడుపుతోంది. అలాగే వ్యాక్సిన్‌కి సంబంధించి అపోహలను పోగొట్టేలా గురుద్వార్‌ ఇతర ప్రార్థన స్థలాలకు సహాయ సహకారాలను అందించి ప్రోత్సహించింది. 

(చదవండి: జిన్‌పింగ్‌ మూడు రోజుల సౌదీ పర్యటన...టెన్షన్‌లో అమెరికా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement