సన్నీలియోన్‌ ఫొటోపై విమర్శలు | Sunny Tweet On Fathers Day Twitterati Trolls Her | Sakshi
Sakshi News home page

Published Wed, Jun 20 2018 8:47 PM | Last Updated on Tue, Oct 2 2018 6:54 PM

Sunny Tweet On Fathers Day Twitterati Trolls Her - Sakshi

గురుద్వార వద్ద భర్త, పిల్లలతో సన్నీ లియోన్‌

సాక్షి, న్యూఢిల్లీ: జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అనే నానుడి తెలిసిందే. బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ విషయంలో ఇది నిజమేననిపిస్తోంది. కరెన్‌జీత్‌ కౌర్‌ నుంచి సన్నీలియోన్‌గా మారిన ఆమె గతంలో పలు అశ్లీల చిత్రాల్లో నటించారు. తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టి కొన్ని సినిమాలు, రియాలిటీ షోలలో కూడా చేశారు. అయితే, ఫాదర్స్‌ డే సందర్భంగా ఆమె ట్వీట్‌ చేసిన ఒక ఫోటోపై నెట్టింట్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘తండ్రిగా, భర్తగా, మిత్రుడిగా, ఆడ మనిషికి జీవితాంతం తోడుండే వ్యక్తికి జోహార్లు..! అతను కురిపించే ప్రేమ అనంతం..! మేమంతా మీ ప్రేమ పాత్రులం నాన్నా..!’ అంటూ ట్వీట్‌ చేశారు. దాంతో పాటు తన భర్త, పిల్లలతో కలిసి గురుద్వార వద్ద దిగిన ఒక ఫోటో, ఏకాంతంగా ఉన్న మరొక ఫోటో ట్వీటర్‌లో పోస్టు చేశారు. ఒక వైపు పవిత్ర గురుద్వారను దర్శించి పాపం చేశారని ఆమెపై కొందరు విమర్శలు చేస్తుండగా.. ఫాదర్స్‌ డే అంటూ తన భర్తతో కలిసి నగ్నంగా దిగిన ఫోటో అందరికీ పరిచయం చేయడమేంటని సన్నీని తిట్టుకుంటున్నారు. 

గతంలో ఆమె ఏం చేసిందో తెలియని వారు కూడా సోషల్‌ మీడియాలో ఆమె ఫోటోను చూసి మండిపడుతున్నారు. తన మేనేజర్‌ను వివాహమాడిన సన్నీ ఇకనైనా పద్ధతిగా ఉండాలని పలువురు ట్విటర్‌లో సూచిస్తున్నారు. ఇంటర్‌నెట్‌లో అశ్లీల ఫోటోలు పెడుతున్న సన్నీపై న్యూసెన్స్‌ కేసు పెట్టాలని మరికొందరు అంటున్నారు. ఆమె అభిమానులు మాత్రం సన్నీకి మద్ధతు పలుకుతున్నారు. ఫాదర్స్‌ డే సందర్భంగా తన కూతురు, భర్తతో ప్రేమగా దిగిన ఫొటోలో సైతం అశ్లీలం వెతికే వారిని పట్టించుకోవద్దని చెప్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement