కాలిఫోర్నియా: అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న గురుద్వార ఒక్కసారి మినీ రణరంగ క్షేత్రంగా మారింది. ప్రశాంతంగా కళ్లుమూసుకుని తమకు ఇష్టమైన దైవాన్ని తలుచుకున్న వారంతా ఒకరినొకరు తిట్టుకున్నారు. అంతటితో ఆగకుండా చేతికి ఏది దొరికితే దాన్నే తీసుకొని కొట్టుకునేందుకు సిద్ధమయ్యారు. కాలిఫోర్నియాలోని ఓ గురుద్వారలో వీకెండ్ సందర్భంగా ఒక చోట చేరిన సిక్కులంతా ప్రార్ధన చేశారు.
అనంతరం అందులోని ఓ సిక్కు మహిళ, గురుద్వార పెద్దలతో ఏదో మాట్లాడుతూ ఆ వెంటనే వారి ముందున్న మైకులను విరిచివేసింది. ఆమెను అడ్డుకునేందుకు ఇంకో మహిళరాగా తోపులాట జరిగింది. ఆ వెంటనే అక్కడ ఉన్న మైకులను, కర్రలను తీసుకొని కొట్టుకోవడమే కాకుండా కొందరు పెప్పర్ స్ప్రేతో కూడా దాడికి దిగినట్లు ఆ వీడియో పేర్కొంది. గురుద్వారాను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంలో చర్చించుకున్నవారు.. అభిప్రాయభేదాలు తలెత్తి రెండు వర్గాలుగా చీలి వెంటనే గొడవకు దిగారని పోలీసులు చెప్తున్నారు. ఈ సమయంలో మొత్తం 100మంది ఉన్నట్లు చెప్పారు.
మైకులు, కర్రలు, పెప్పర్ స్ప్రేతో మహిళా భక్తుల ఫైట్
Published Wed, Jan 13 2016 5:38 PM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM
Advertisement
Advertisement