భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే?!
జోషిమఠ్ : హిందూ-ముస్లింల ఐక్యతను మరోసారి ప్రపంచానికి చాటారు. కేవలం కొందరి స్వార్థప్రయోజనాల వల్లే ఈ రెండు వర్గాల మద్య ఘర్షణలు తప్ప వాస్తవంగా ఇద్దరి మధ్య ఎటువంటి విబేధాలు లేవని ఇరు వర్గాలు మరోసారి తమ చర్యల ద్వారా స్పష్టం చేశాయి. ముస్లింల పవిత్ర దినమైన ఈద్ పండుగ రోజు నమాజ్‌చేసుకోవడానికి తమ గురుద్వారాను ఇచ్చి.. మత సామరస్యానికిమరో సారి నిలువుటద్దంలా నిలిచారు. ఇందుకు సంబంధించిన ఆసక్తిర విషయాలు ఇవి.
చార్‌దామ్ యాత్రలో మజిలీ అయినా బద్రినాథ్‌కు వెళ్లే దారిలో జోషిమఠ్ వస్తుంది. ఇక్కడ సిక్కులు, హిందువులు, ముస్లింలు చాలామంది నివసిస్తుంటారు. ఈ జోషిమఠ్‌లో శనివారం ఈద్ పండుగను పురస్కరించుకుని ముస్లింలు పెద్దఎత్తున గాంధీ మైదాన్‌లో నమాజ్‌కు ఏర్పాట్లు చేసుకున్నారు. వర్షం భారీగా కురవడంతో ప్రార్థన చేసుకునేందుకు ముస్లింలు ఇబ్బంది పడ్డారు. వారి పరిస్థిని మగనించిన హేమకుండ్ గురుద్వారా ప్రభంధక్ కమిటీవారు.. తమ గురుద్వారాలో నమాజ్ చేసుకునేందుకు సిక్కు సోదరులు అవకాశం కల్పించారు. సిక్కు సోదరులు ప్రేమగా నమాజ్‌చేసుకోవడానికి ఆహ్వానించడంతో సుమారు వెయ్యిమంది ముస్లింలు గురుద్వారా నమాజ్ చేసుకున్నారు. ఆ సమయంలో ముస్లింలు టీ, పాలు ఇతర పదార్థాలను అందించారు.