మరేం చేయాలి.. లొంగిపోవాలి అంతే! | Actor Manish Raisinghan Married Sangeita Chauhaan In Mumbai | Sakshi
Sakshi News home page

ప్రేయసిని పెళ్లాడిన నటుడు..

Jun 30 2020 7:50 PM | Updated on Jun 30 2020 8:03 PM

Actor Manish Raisinghan Married Sangeita Chauhaan In Mumbai - Sakshi

ముంబై: టీవీ నటులు మనీష్‌ రాయ్‌సింఘన్‌, సంగీత చౌహాన్‌ పెళ్లి చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న వీరు మంగళవారం వివాహ బంధంలో అడుగుపెట్టారు. ముంబైలోని ఓ గురుద్వారలో అత్యంత సన్నిహితుల సమక్షంలో లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా వీరి పెళ్లి జరిగింది. ఇక వధూవరులిద్దరు తమ దుస్తులకు మ్యాచ్‌ అయ్యే మాస్కులు ధరించడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో నెటిజన్లు, అభిమానులు కొత్తజంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ‘ససురాల్‌ సిమర్‌ కా’ అనే హిందీ సీరియల్‌తో పాపులర్‌ అయిన మనీశ్‌ రాయ్‌సింఘన్.. ఆ తర్వాత ‘ఏక్‌ శ్రింగార్‌- స్వాభిమాన్‌’ మరో సీరియల్‌లో నటించాడు. (వెండితెరపై ‘1200 కిలో మీటర్ల పయనం’)

ఈ క్రమంలో సహ నటి సంగీత ప్రేమలో పడిన అతడు ఇరు కుటుంబాల అంగీకారంతో ఆమెను వివాహమాడనున్నట్లు ఇటీవలే ప్రకటించాడు. ఇక పెళ్లి సందర్భంగా.. ‘‘అసలు ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా ఎన్నడూ ఊహించలేదు! నాకు పెళ్లా? మరి ఏం చేయను.. తన సింప్లిసిటీ, నిష్కల్మషమైన మనసుతో ఓ అమ్మాయి మనల్ని ఆకర్షిస్తే ఏం చేయగలం. లొంగిపోవాలి​ అంతే కదా.. ఆ లవ్‌లీ లేడీ సంగీత చౌహాన్‌. నాతో జీవితాంతం కలిసి ఉండే శిక్ష అనుభవించకతప్పదు. ఇకపై ఆ దేవుడే తనను కాపాడాలి. స్వాగతం సంగీత’’అంటూ కాబోయే భార్యను తన జీవితంలోకి ఆహ్వానించాడు. ఇక తన ప్రాణ స్నేహితుడినే భర్తగా పొందడం నమ్మలేకుండా ఉన్నానని సంగీత పేర్కొన్నారు. (బాలీవుడ్‌కీ హోమ్‌ డెలివరీ )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement