రోగుల షీట్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్
నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో తీరు మారలేదు. ఆస్పత్రిని కలెక్టర్ రామ్మోహన్ రావు గతంలో ఆకస్మిక తనిఖీ చేసిన సమయంలో పలువురు వైద్యులు అనధికారికంగా విధులకు హాజరుకాని విషయం వెలుగులోకి వచ్చింది. కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్యాధికారులు గైర్హాజరైన వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి హెచ్చరించారు. శనివారం కలెక్టర్ మరోసారి ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేయగా అదే పరిస్థితి ఎదురైంది. పలువురు వైద్యులు గైర్హాజరయ్యారు. కలెక్టర్ ఆస్పత్రిలోని వివిధ వార్డులను సందర్శించగా, అత్యవసర విభాగంలో ఒకరికి బదులు మరొకరు విధులు నిర్వర్తిస్తూ కనిపించారు. దీంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్వక్తం చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ అనుమతి లేకుండానే మరొకరికి బదులు గా అత్యవసర విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ యుగేంధర్, అదేవిధంగా మెటర్నిటీ వార్డులో విధులకు గైర్హాజరైన వైద్యులు కృష్ణ కూమారి, నస్రీన్ ఫాతిమా, భీంసింగ్, స్టాఫ్ నర్సు ప్రేమలతలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎంఐసీ, ఐసీయూ, ఆర్థోపెడి క్ విభాగాలతో పాటు వంటగది, బ్లడ్‌బ్యాంకు, సదరం క్యాంపును కలెక్టర్ పరిశీలించారు. వివిధ విభాగాల వార్డుల్లో ఆస్పత్రి సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. రోగులను పరామర్శించారు. రోగులకు ఎదురయ్యే సమ స్యలను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నా రు. అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి సమ స్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రి సిబ్బంది, అధికారులు సమస్వయంతో కలిసి పని చేయాలన్నారు. రోగులకు అసాకర్యం కలుగకుండా సేవలు అందించాలన్నారు. ప్రతిరోజు ఆస్పత్రి ని శుభ్రంగా ఉంచాలని, ఆస్పత్రి ఆవరణలో ఎక్కడకూడా చెత్త, ఇతర వస్తువులు కనిపించ కూడదన్నారు. వార్డుల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను నోటీసు బోర్డులో ప్రదర్శించాలన్నా రు. వార్డుల్లో స్పేస్ విభజన సక్రమంగా లేదని క లెక్టర్ పేర్కొన్నారు. ఒక్కో వార్డులో ఒక్కో విధం గా ఉందన్నారు.
పరిశీలించి తగు విధంగా ఏ ర్పాటు చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చే స్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీలో ఆస్పత్రి సూ పరింటెండెంట్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, ఆర్‌ఎంఓ ఉంటారన్నారు. ఈ కమిటీ పదిహే ను రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. ఆస్పత్రిలో పది లిఫ్ట్‌లు ఉండగా, రెండు మాత్రమే పని చే స్తున్నాయి. మిగతా లిఫ్ట్‌లకు వెంటనే మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాల ని కలెక్టర్ సూచించారు. వైద్య విద్యార్థులకు మె నూ ప్రకారం భోజనం, టిఫిన్ అందించాలన్నారు. సదరం క్యాంపులో దివ్యాంగులకు వేగంగ సర్టిఫికెట్లు జారీ చేయాలన్నారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించి ఆస్పత్రి అ భివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment