Vidya Balan: పోలీసులను ఆశ్రయించిన విద్యాబాలన్‌! | Vidya Balan Lodged FIR Against Unknown Person For Creating Fake Instagram Account In Her Name, Deets Inside - Sakshi
Sakshi News home page

విద్యాబాలన్‌ పేరుతో డబ్బులు వసూలు.. పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్‌

Published Wed, Feb 21 2024 4:20 PM | Last Updated on Wed, Feb 21 2024 5:04 PM

Vidya Balan Lodged An FIR Against An Unknown Person For Creating Fake Instagram Account In Her Name - Sakshi

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో విద్యాబాలన్‌ ఒకరు. తన సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలనూ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు చిట్‌ చాట్‌ చేస్తూ అభిమానుల ప్రశ్నలకు సరదా సమాధానాలు ఇస్తుంటారు. ఇప్పుడదే కొంతమంది మోసగాళ్లకు బలమైంది. నెట్టింట చురుగ్గా ఉండే విద్యాబాలన్‌ పేరుతో ఓ నకిలీ అకౌంట్‌ని క్రియేట్‌ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా విద్యాబాలన్‌ దృష్టికి వెళ్లడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
జాబ్స్‌ ఇప్పిస్తానంటూ.. 
తనదైన అందం అభినయంతో బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విద్యాబాలన్‌. వరుసగా లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తూ.. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్‌ మీడియాను మాత్రం పక్కకి పెట్టదు. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆమె ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పడు ఇన్‌స్టాలో అప్‌లోడ్‌ చేస్తుంటారు. అయితే ఆ మధ్య అచ్చం విద్యాబాలన్‌ నిజమైన ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీతోనే ఓ ఫేక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేశారు కొంతమంది దుండగులు. ఆమె అకౌంట్‌లోని ఫోటోలు, వీడియోలు అన్ని ఫేక్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు.

కొన్నాళ్ల తర్వాత అభిమానులతో చాట్‌ చేస్తూ.. వారి నుంచి డబ్బులు వసూలు చేశారు. కొంతమందికి జాబ్స్‌ ఇప్పిస్తామని, అందుకోసం కొంత అమౌంట్‌ ఖర్చు అవుతుందంటూ పెద్ద ఎత్తున్న డబ్బులు కాజేశారు. ఈ విషయం ఆలస్యంగా విద్యాబాలన్‌ దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె వెంటనే ఖార్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెక్ష‌న్ 66 (C) ఐటీ యాక్ట్ కింద కేసు న‌మోదు చేసిన‌ పోలీసులు.. ఫేక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసిన ముఠాను కనిపెట్టే పనిలో ఉన్నారు. ఆ మధ్య సల్మాన్‌ ఖాన్‌ ప్రొడ‌క్ష‌న్స్ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్  చేసి డబ్బులు వసూలు చేశారు. 

‘భూల్‌ భూలయ్య 3’లో విద్యా బాలన్‌
సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు విద్యాబాలన్‌. కథ, తన పాత్ర నచ్చితేనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. ప్రస్తుతం  భూల్‌ భులయ్య 3లో నటిస్తున్నారు. అందులో మంజులిక పాత్రను పోషించబోతున్నట్లు హీరో కార్తిక్‌ ఆర్యన్‌ ప్రకటించాడు.  అనీస్ బ‌జ్మీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement