ప్రసిద్ధ ఇండస్ట్రియలిస్ట్ నకిలీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. అదే విధంగా తమ జోలికొస్తే నకిలీరాయుళ్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టాటా సన్స్ గ్రూపు ద్వారా దేశవ్యాప్తంగా భారీ ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలను టాటాలు చేపడుతున్నారు. అయితే రతన్‌టాటా ఫౌండేషన్ పేరుతో కొందరు కేటుగాళ్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఫేక్‌పేజీలు సృష్టించి వసూళ్లకు పాల్పడుతున్నారు.
ఇలాంటి నకీల పేజీల్‌ను నమ్మోద్దంటూ రతన్ టాటా ప్రజలను కోరారు. టాటా ఫౌండేషన్ ఎటువంటి డొనేషన్లను ఇలాంటి పద్దతుల్లో స్వీకరించదని తేల్చి చెప్పారు. టాటా ఫౌండేషన్ పేరుతోనే కాకుండా తన సన్నిహతులు, కొలిగ్స్ పేరుతో కూడా నకిలీ ఖాతాలు తెరిచి డొనేషన్లు అడుగుతున్నారని, అలాంటి వాటిని గుర్తించి ఫిర్యాదు చేయాలని సూచించారు. అంతేకాదు నకిలీ పేజీలతో అక్రమంగా నగదు వసూలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామంటూ రతన్ టాటా హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment