Instagram Fake Account: Husbend Creates Fake Social Media Accounts To Harass Wife - Sakshi
Sakshi News home page

వీడు భర్తేనా.. ఇన్‌స్టాగ్రామ్‌లో భార్యకు అసభ్యకరంగా..

Published Wed, Apr 13 2022 4:58 PM | Last Updated on Wed, Apr 13 2022 5:21 PM

Man Creates Fake Social Media Accounts To Harass Wife - Sakshi

సాక్షి, ముంబై: కట్టుకున్న భార్యనే సోషల్‌ మీడియా వేధికగా వేధింపులకు గురి చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేసిన ఆమెకు అసభ్యకరమైన మేసేజ్‌లు చేస్తూ వేధించాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. దేశంలో త్రిపుల్‌ తలాక్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. అయితే, ‘త్రిపుల్ తలాక్ ’ విధానంలో తనకు విడాకులు ఇచ్చాడని ఓ యువతి తన భర్తపై కేసు పెట్టింది. కేసు పెట్టిందన్న కోపంతో ఆమె భర్త.. ఇన్‌స్టాగ్రామ్‌లో 11 ఫేక్ అకౌంట్లు సృష్టించాడు. ఆ అకౌంట్లతో ఆమెకు.. అసభ్యకరంగా మెసేజ్‌లు చేయడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా ఆమెతోపాటు, కుమార్తెకు కూడా ఇలా మెసేజ్‌లు పంపించాడు.

అతని ఆగడాలకు చిరెత్తిపోయిన ఆమె.. పోలీసులను ఆశ్రయించింది. తన భర్త అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement