Instragam
-
మచ్చల జింక, దెయ్యం అంటూ అవహేళనలు..! ఐనా..
మనల్ని ఎవరైన కామెంట్ చేస్తేనే దిగులు పడిపోతాం. మనం బాగానే ఉన్నా.. ఏదో ఒక విధంగా కామెంట్ చేస్తారనే విషయం తెలిసిందే. అలాంటిది అస్సలు రూపమే చూసేందుకు అసహ్యంగా ఉంటే.. అస్సలు బయటకు అడుపెట్టం. కానీ ఈ అమ్మాయి ఆ బాధను దిగమింగడం కాదు..సానుకూలంగా ఆ వైకల్యాన్ని అంగీకరించింది. ఆ అవహేళనలను అధిగమంచి తానెంటో ప్రపంచానికి తెలియజేడమే కాకుండా ఎందరికో స్ఫూర్తిని ఇచ్చింది. జన్మతః లేదా మరేదైన కారణం వల్ల వచ్చే వైకల్యం లేదా అనారోగ్యంతో చతికిలపడిపోకూడదని చాటి చెప్పింది. సత్తువ, స్థైర్యం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ప్రూవ్ చేసింది. ఎవరంటే ఆమె..కేరళలోని తిరువనంతపురంకి చెందిన 24 ఏళ్ల బిస్మిత. చిన్నప్పటి నుంచి ఎన్నో హేళనలు, చిత్కారాలు. ఎందుకంటే..? బిస్మిత అరుదైన జన్యుపరమైన చర్మ పరిస్థితి కారణంగా శరీరం అంతా మచ్చల మచ్చలుగా ఉంటుంది. ఇలా బిస్మతకు పుట్టిన రెండు నెలలకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయితే ఆమె తల్లి మజిత(47)కు కూడా ఇలానే ఉండటంతో..అదే ఆమెకు వంశపారపర్యంగా వచ్చేసింది. కేరళలోని ఆసుపత్రులన్నీ తిరిగింది ఆమె తల్లి. జన్యుపరంగా వచ్చే చర్మ సమస్య, చికిత్స లేదని వైద్యులు చేతులెత్తేయడంతో.. కూతురి జీవితం ఏమైపోతుందోనని ఆందోళనకు గురైంది మజిత. చెప్పాలంటే ఇది ఒక విధమైన బొల్లి వ్యాధి మాదిరిగా బిస్మిత చర్మం ఉంటుంది. ఎన్ని అవమానాలు ఎదురైనా.. చదువును మాత్రం వదల లేదు. అలా ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది. అయితే బిస్మిత చిన్నప్పుడు స్కూల్లో జరిగే పాటల పోటీల్లో ఎప్పుడూ ఆమెనే విజేత. అందరూ ఆమె గొంతు బాగుంటుందని ప్రశంసించేవారు. దీంతో తానే సొంతంగా వీడియోలు తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది బిస్మితకి. అందుకు అమ్మ కూడా ఒప్పుకోవడంతో 2019లో టిక్‌టాక్ వీడియోలు చేయడం ప్రారంభించింది. అయితే వాటికి ప్రశంసలు కన్నా విమర్శలే ఎక్కువగా వచ్చేవని బాధగా చెబుతోంది బిస్మిత. అస్సలు నీ ముఖం అద్దంలో చూసుకున్నావా..నువ్వు దెయ్యానివా లేక మచ్చల జింకవా.. అంటూ కామెంట్లు పెట్టేవారు. ఇది జన్యుపరమైన సమస్య కదా!..దీన్నే ఇంతలా పట్టించుకుంటున్నారేంటీ అని బాధగా ఉండేది బిస్మతకి. అయినా సరే వీడియోలు తీయడం ఆపలేదు. అనుకోకుండా టిక్‌టాక్‌ని మనదేశంలో బ్యాన్ చేయడంతో ఇన్‌స్టాలో రీల్స్ పోస్ట్ చేసేది. వాటిని కూడా అసభ్య పదజాలంతో ట్రోలింగ్ చేసేవారు. అయినా సరే వెనకడుగు వేయడకుదని గట్టిగా నిశ్చయించుకుంది బిస్మిత. అయితే ఇన్‌స్టాలో బిస్మిత వీడియో చూసి.. ఓ ఫొటోగ్రాఫర్ మేకోవర్ పేరుతో ఫొటో షూట్ చేస్తానని అడిగాడు. ఆ షూట్లో నవ వధువులా బిస్మిత మేకప్‌తో ఉంటుంది. అందమైన వధువుగా బిస్మిత మారిన వీడియో ఇన్‌స్టాలో పోస్ట్ చేసినప్పుడు ఒక్క రోజులోనే లక్షల వ్యూస్ వచ్చాయి. దీంతో ‘బిస్మి వ్లాగ్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది బిస్మిత. మచ్చలున్న అమ్మాయిని పెళ్లాడటానికి ఎవరు ముందుకొస్తారని బంధువులంతా అన్నారు. కానీ ఆటో డ్రైవర్ సాను తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది. ఆయన సపోర్ట్ ఎంతో ఉందంటోంది బిస్మిత. ఈ రీల్స్‌లో తనలాంటి వాళ్లు ఎదుర్కొనే సమస్యలను, రోజువారీ విషయాలను షేర్ చేస్తుంది బిస్మిత. ఆ దంపతులకు ఒక కొడుకు కూడా. అయితే అతడికి కూడా ఇలాంటి జన్యు సమస్యే వచ్చింది. తన కొడుకు అయినా ఈ సమస్య నుంచి బయటపడాలని ఆమె భర్త ఎన్నో ఆస్పత్రులు తిప్పాడు కానీ ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో ప్రస్తుతం బాబుకి ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో నేర్పుతోంది బిస్మిత. ఈ విషయాన్నే వీడియోలో చూపిస్తుంటే..దీనికి కూడా ఆమెను విమర్శించడం బాధకరం. కొడుకు అలా ఉన్నా కూడా.. వీడియోలు చేస్తున్నావు..నీ బతుకు ఇంతేనా అని తిడుతూ కామెంట్లు పెడుతున్నారని బాధగా చెప్పింది బిస్మిత. అయితే తాను వాటిని పట్టించుకోను ఇంకా అలాంటివే చేస్తాను..నా కొడుకికి ఎలా ధైర్యంగా ఉండాలో చెప్పేందుకైనా ఆపాను అని స్టైర్యంగా చెబుతోంది బిస్మిత.నిజంగా బిస్మిత చాలా గ్రేట్ కదూ..! జస్ట్ ఎవ్వరైనా చిన్నగా.. ఏదైనా అన్నా.. తట్టుకోలేం, ఈజీగా తీసుకోలేం. అలాంటిది ఆమె తన రూపం అలా ఉన్నా ధైర్యంగా కెమెరా ముందుకు రావడమే గాక తనలాంటి వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. నిజంగా బిస్మిత తనలాంటి వాళ్లకే కాదు..ట్రోలింగ్కి గురయ్యి బాధపడుతున్నవారికి కూడా ఈమె స్ఫూర్తి.(చదవండి: ఫిడే చెస్ రేటింగ్ పొందిన అతిపిన్న వయస్కురాలు! దటీజ్ జియానా గర్గ్..!) -
ప్రభాస్ ఇన్‌స్టా అకౌంట్ మిస్.. హ్యాక్ అయ్యిందా?
సోషల్ మీడియాకు కాస్త దూరంగానే ఉంటాడు ప్రభాస్. ఆయనకు ఇన్‌స్టా, ఫేస్బుక్,ఎక్స్ అకౌంట్లు ఉన్నా.. వాటిని సినిమా ప్రమోషన్స్ కోసమే వాడుతుంటాడు. తాజాగా ఈ పాన్ ఇండియా స్టార్ ఇన్‌స్టా అకౌంట్‌ని ఎవరో హ్యాక్ చేశారు. ఇన్‌స్టాలో ప్రభాస్ పేరును సెర్చ్ చేస్తుంటే.. ‘ఈ పేజీ అందుబాటులో లేదు’అనే సందేశం వస్తోంది. ఫ్యాన్‌మేడ్ అకౌంట్స్ మాత్రం కనిపిస్తున్నాయి కానీ అఫిషియల్ అకౌంట్ మిస్ అయింది. ప్రస్తుతం హ్యాక్ అయిన అకౌంట్‌ని వెనక్కి తీసుకువచ్చేందుకు ప్రభాస్ టీమ్ ప్రయత్నిస్తోంది. కాగా, జులై నెలలో ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ కూడా హ్యాకింగ్‌కు గురైంది. ‘మనుషులు దురదృష్టవంతులు’ అంటూ హ్యాకర్లు ప్రభాస్ అకౌంట్ నుంచి ఓ వీడియో వదిలారు. అది చూసి ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కంగారు పడ్డారు. దీంతో తన అకౌంట్ హ్యాక్ అయినట్లు ప్రభాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్ అవ్వడం పట్ల ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. యాంటీ ఫ్యాన్సే హ్యాక్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ సినిమా విషయాలకొస్తే.. డిసెంబర్ 22న సలార్ పార్ట్ 1 విడుదల కాబోతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతీహాసన్ హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కీ 2898 ఏడీ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్, సందీప్ వంగతో స్పిరిట్ చిత్రాల్లో ప్రభాస్ నటించనున్నాడు. -
బాలీవుడ్ నటి లగ్జరీ కారు, దర్జా పోజు వైరల్
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటులు,లగ్జరీ కార్లును సొంతం చేసుకోవడం చాలాకామన్. తాజాగా లంచ్‌బాక్స్ నటి ఈ లిస్ట్‌లో చేరింది. బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ తాజాగా లగ్జరీకారును కొనుగోలు చేసింది. కొత్త కారుకు సంబంధించిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. "వెల్కమ్ హోమ్ మై బ్లాక్ బీస్ట్" అంటూ ఒక పిక్నుషేర్ చేసింది. కొత్త కారు కొన్నందుకు ఫ్యాన్స్ అభినందనలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం కౌర్ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు కొత్త రేంజ్ రోవర్లో ముంబైలోని మాడాక్ ఫిల్మ్స్ ఆఫీసుకు వచ్చిన వీడియో ఒకటి ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతోంది. ఐదో తరం రేంజ్ రోవర్ కారు భారతదేశంలో కంపెనీ విడుదల చేసినంది. నటి నిమ్రత్ కొన్న రేంజర్ రోవర్ ఎస్యూవీ ధర 2.38 కోట్లకు పై మాటేనని అంచనా . నిమ్రత్‌కౌర్ అభిషేక్ బచ్చన్ ,యామీ గౌతమ్‌లతో కలిసి నటించిన దాస్విలో కనిపించింది. ఈ మూవీలో అభిషేక్ ఆన్ స్క్రీన్ భార్య బిమ్లా దేవి పాత్రలో నటించింది. దాస్వీ కంటే ముందు 2016లో అక్షయ్ కుమార్ ఎయిర్‌లిఫ్ట్‌లో నటించింది. ఒక హిందీ వెబ్ సిరీస్ ది టెస్ట్ కేస్‌లో కూడా కౌర్ యాక్ట్ చేసింది. కాగా కొత్త రేంజ్ రోవర్ స్టాండర్డ్ , లాంగ్-వీల్‌బేస్ బాడీ డిజైన్లలో ఐదు సీట్లతో అందుబాటులో ఉంది. కొత్త రేంజ్ రోవర్ హైబ్రిడ్ ధరలు రూ. 2.61 కోట్లు నుండి ప్రారంభం. గత నెలలో కారు డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఈ కారు పెట్రోల్ , డీజిల్ వెర్షన్లలో, 25 ట్రిమ్స్‌లో లభ్యం. -
వీడు భర్తేనా.. ఇన్‌స్టాగ్రామ్‌లో భార్యకు అసభ్యకరంగా..
సాక్షి, ముంబై: కట్టుకున్న భార్యనే సోషల్ మీడియా వేధికగా వేధింపులకు గురి చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసిన ఆమెకు అసభ్యకరమైన మేసేజ్‌లు చేస్తూ వేధించాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. దేశంలో త్రిపుల్ తలాక్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. అయితే, ‘త్రిపుల్ తలాక్ ’ విధానంలో తనకు విడాకులు ఇచ్చాడని ఓ యువతి తన భర్తపై కేసు పెట్టింది. కేసు పెట్టిందన్న కోపంతో ఆమె భర్త.. ఇన్‌స్టాగ్రామ్‌లో 11 ఫేక్ అకౌంట్లు సృష్టించాడు. ఆ అకౌంట్లతో ఆమెకు.. అసభ్యకరంగా మెసేజ్‌లు చేయడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా ఆమెతోపాటు, కుమార్తెకు కూడా ఇలా మెసేజ్‌లు పంపించాడు. అతని ఆగడాలకు చిరెత్తిపోయిన ఆమె.. పోలీసులను ఆశ్రయించింది. తన భర్త అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. -
సగం ట్విటర్ ఫాలోవర్స్ ఫేక్
సోషల్ మీడియా యుగంలో ట్విటర్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగాంలో ఎంత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే అంతగొప్పగా ప్రముఖులు భావిస్తుంటారు. ఇక రాజకీయ నాయకుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ ప్రచారం, వ్యక్తిగతంగా పేరు ప్రఖ్యాతుల కోసం సోషల్ మీడియా మీదే ఆధారపడుతున్నారు. దాదాపు అన్ని ప్రధాన పార్టీలు సోషల్ మీడియా విభాగాల్ని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే మన రాజకీయ నేతల సోషల్ మీడియా ఖాతాల్లోని ఫాలోవర్స్ చాలావరకూ నకిలీ అని తేలుతున్నాయి. ముఖ్యంగా ట్విటర్లో సగం ఫాలోవర్స్ ఫేక్ అని ట్విటర్ ఆడిట్, ట్విప్లమసీ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ నకిలీ ఫాలోవర్స్ జాబితాలో రాహుల్ గాంధీ టాప్‌లో నిలిస్తే ఆ తర్వాత స్థానంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఉన్నారు. రాహుల్‌కి ట్విటర్లో 62 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటే వారిలో 68 శాతం మంది ఫేక్ అని సర్వే తేల్చింది. ప్రధాని మోదీకి 4 కోట్ల 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటే వారిలో ఏకంగా 2.5 కోట్ల మంది ఫేక్ అని తెలిపింది. అంతర్జాతీయంగా పోప్ ఫ్రాన్సిస్‌కి 48 శాతం, హిల్లరీ క్లింటన్‌కి 31 శాతం, డొనాల్డ్ ట్రంప్‌కి 26 శాతం నకిలీ అనుచరులు ఉన్నారు. రాజకీయ ప్రముఖుల్ని ఫాలో అవుతున్న వారిలో 5 వేల మందిని శాంపిల్‌గా తీసుకొని ఈ నివేదిక రూపొందించారు. ఫేక్ ఖాతాల వెనుక గుట్టు ఇది.. ఇందుకోసం ట్విట్టర్లో బాట్స్ అనే సాఫ్ట్‌వేర్‌ని వాడుతున్నారు. ట్వీట్, రీ ట్వీట్ , ఫాలోయింగ్ , అన్‌ఫాలోయింగ్, అకౌంట్ మేనేజింగ్ను ఆటోమెటిక్‌గా చేసే సాధనమే బాట్స్.. ఈ సాప్ట్‌వేర్‌ని దుర్వినియోగం చేయడం వల్లే ఫేక్ ఫాలోవర్స్ పుట్టుకొస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ప్రధాని మోదీకి కేవలం నెలరోజుల్లోనే 70 లక్షల మంది ఫాలోవర్స్ పెరగడంతో ఆయన పాపులారిటీ పెరిగిందని, ట్రంప్‌ని ఆయన మించిపోతారని అనుకున్నారు. అయితే నెల వ్యవధిలో అన్ని లక్షల మంది ఫాలోవర్స్ పెరగడం ఎలా సాధ్యమన్న ప్రశ్నలు వినిపించాయి. రాహుల్‌గాంధీకి రెండు నెలల్లోనే 10 లక్షల మంది ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఆయన ట్వీట్లకి నిముషాల్లోనే వేల సంఖ్యలో రీట్వీట్లు వస్తున్నాయి. దీనికంతటికీ ఆటోమేటెడ్ బాట్స్ వినియోగించడమే కారణమని తేలింది. ట్విటర్లో నకిలీ ఖాతాలు పెరగడంతో దాని యాజమాన్యం కూడా చర్యలు మొదలు పెట్టింది. ఫిబ్రవరిలో అమెరికాలో చాలా మంది సెలిబ్రిటీల ఫేక్ ఫాలోవర్స్ ఖాతాల్ని రాత్రికి రాత్రే రద్దు చేసింది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఆ బాయ్‌ఫ్రెండ్ ఎవరు?
నటి అమలాపాల్ గట్టిగా కౌగిలించుకుని చుంబనాలతో ముంచెత్తిన ఆ వ్యక్తి ఎవరు? అన్నది కోలీవుడ్‌లో ఆసక్తిగా మారింది. దర్శకుడు విజయ్ను ప్రేమించి పెళ్లాడి రెండేళ్లు సంసార జీవితాన్ని జాలీగా ఎంజాయ్ చేసిన నటి అమలాపాల్ ఆ తరువాత విడాకులు పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడామె తన దృష్టిని పూర్తిగా నటనపైనే పెట్టారు. అదే విధంగా దోస్తానాను కూడా పెంచారనే ప్రచారం జోరందుకుంది. ఫ్రెండ్స్, పార్టీలు, పబ్‌లు అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇక వదంతుల సంగతి చెప్పనక్కర్లేదు. నటుడు ధనుష్‌తో కలిపి వచ్చిన వార్తలకు తాను చింతిస్తూ తీవ్రంగా ఖండించారు కూడా. కాగా ఇటీవల సొంత రాష్ట్రం కేరళకు వెళ్లిన అమలాపాల్ తన ఇన్ స్ట్రాగామ్‌లో ఒక ఫొటో పోస్ట్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే అమలాపాల్ ఒక యువకుడిని గట్టిగా కౌగిలించుకుని ముద్దులతో ముంచెత్తిన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. అయితే ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరు? ఆమె బాయ్‌ఫ్రెండా? అన్న పలు ప్రశ్నలు కోలీవుడ్ వర్గాల్లో రేకెత్తుతున్నాయి. వెంటనే కొందరు ఈ విషయమై అమలాపాల్‌ను ప్రశ్నించగా ఆ వ్యక్తి తనకు ఫ్రెండ్ మాత్రమే. ఆయన పేరు అజిత్ మీనన్ టూ బదులిచ్చారు. ఆయనకు పెళ్లి అయ్యిందని కూడా తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను ముద్దు పెట్టుకున్న ఫొటోలను వెబ్సైట్లో విడుదల చేయడమేమిటన్న అభిమానుల ప్రశ్నకు మాత్రం డోంట్ కేర్ అంటూ నిర్లక్ష్యంగా బదులివ్వడమే గాకుండా అజిత్ మీనన్ తో దిగిన మరిన్ని ఫొటోలను తన ఇన్ స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు. దీంతో అమలాపాలా? మజాకా? అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. -
ఇలా కూడా ఫేమస్ అయిపోవచ్చా!
సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షించి స్టార్డమ్ పొందాలంటే ఆషామాషీ కాదు. అది కేవలం సినిమా నటులకో, క్రీడాకారులకో, ధనవంతులకో లేదా కాస్త చక్కనిరూపం ఉన్నవాళ్లకో సాధ్యమైన పని.. ఈ జాబితాలో లేకుండా పేరు సంపాదించాలంటే మాత్రం కష్టమైన పనే. అయితే తనకు ఇలాంటి అడ్డంకులేవీ లేవని అయినప్పటికీ తాను పేరు గడించానంటోంది పోలాండ్లోని వార్సాకు చెందిన అమ్మాయి. ఆమె పేరు నటాలియా గుట్కివిజ్. నటాలియా అందరి లాంటి సాదాసీదా 20 ఏళ్ల అమ్మాయి. ఇన్‌స్ట్రాగామ్‌లో కేవలం 443 పోస్టులు మాత్రమే చేసింది. కానీ ఒక లక్ష మంది ఫాలోవర్లను నటాలియా సంపాదించుకుంది. ఇదేలాగంటే సోషల్ మీడియాలో తన ఫొటోను పోస్ట్ చేసే ప్రతిసారీ ముఖం కనిపించకుండా జాగ్రత్త పడడమే. నటాలియా కళ్లు, పెదవులు లేదా వెనుక భాగమో కనిపించేలా మాత్రమే తను ఫొటో లను పోస్టు చేసేది. కాబట్టి తన ఎలా ఉంటుందో ఎవరికీ ఇంతవరకు తెలీదు. దీంతో ఆ అమ్మాయి ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరికీ నెలకొంది. నటాలియాను ఫాలో అయ్యేవారందరూ తన తదుపరి ఫొటోలో అన్నా పూర్తి ఫొటోను పోస్టు చేయకపోతుందా అంటూ కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తుంటారు. కానీ తాను మాత్రం ఫొటోను పోస్టు చేసిన ప్రతిసారి తన ముఖాన్ని కొంచెం కొంచెం మాత్రమే కనిపించేలా ఫోజులిస్తూ ఆసక్తి రేకెత్తిస్తోంది. చూద్దాం నటాలియా ఎప్పుడూ తన పూర్తి రూపాన్ని బహిర్గతం చేస్తోందో. ఇక మీరు కూడా ఆమెలా వినూత్నంగా ఆలోచించి మరో మార్గంలో గుర్తింపు పొందడానికి ప్రయత్నించండి.