ఆ బాయ్‌ఫ్రెండ్‌ ఎవరు? | Who is that boyfriend? | Sakshi
Sakshi News home page

ఆ బాయ్‌ఫ్రెండ్‌ ఎవరు?

Feb 14 2017 1:46 PM | Updated on Sep 5 2017 3:37 AM

ఆ బాయ్‌ఫ్రెండ్‌ ఎవరు?

ఆ బాయ్‌ఫ్రెండ్‌ ఎవరు?

నటి అమలాపాల్‌ గట్టిగా కౌగిలించుకుని చుంబనాలతో ముంచెత్తిన ఆ వ్యక్తి ఎవరు?

నటి అమలాపాల్‌ గట్టిగా కౌగిలించుకుని చుంబనాలతో ముంచెత్తిన ఆ వ్యక్తి ఎవరు? అన్నది కోలీవుడ్‌లో ఆసక్తిగా మారింది. దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లాడి రెండేళ్లు సంసార జీవితాన్ని జాలీగా ఎంజాయ్‌ చేసిన నటి అమలాపాల్‌ ఆ తరువాత  విడాకులు పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడామె తన దృష్టిని పూర్తిగా నటనపైనే పెట్టారు. అదే విధంగా దోస్తానాను కూడా పెంచారనే ప్రచారం జోరందుకుంది. ఫ్రెండ్స్, పార్టీలు, పబ్‌లు అంటూ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇక వదంతుల సంగతి చెప్పనక్కర్లేదు.

నటుడు ధనుష్‌తో కలిపి వచ్చిన వార్తలకు తాను చింతిస్తూ తీవ్రంగా ఖండించారు కూడా. కాగా ఇటీవల సొంత రాష్ట్రం కేరళకు వెళ్లిన అమలాపాల్‌ తన ఇన్ స్ట్రాగామ్‌లో ఒక ఫొటో పోస్ట్‌ చేశారు. అది ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే అమలాపాల్‌ ఒక యువకుడిని గట్టిగా కౌగిలించుకుని ముద్దులతో ముంచెత్తిన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. అయితే ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరు? ఆమె బాయ్‌ఫ్రెండా? అన్న పలు ప్రశ్నలు కోలీవుడ్‌ వర్గాల్లో రేకెత్తుతున్నాయి. వెంటనే కొందరు ఈ విషయమై అమలాపాల్‌ను ప్రశ్నించగా  ఆ వ్యక్తి తనకు ఫ్రెండ్‌ మాత్రమే. ఆయన పేరు అజిత్‌ మీనన్ టూ బదులిచ్చారు.

ఆయనకు పెళ్లి అయ్యిందని కూడా తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను ముద్దు పెట్టుకున్న ఫొటోలను వెబ్‌సైట్‌లో విడుదల చేయడమేమిటన్న అభిమానుల ప్రశ్నకు మాత్రం డోంట్‌ కేర్‌ అంటూ నిర్లక్ష్యంగా బదులివ్వడమే గాకుండా అజిత్‌ మీనన్ తో దిగిన మరిన్ని ఫొటోలను తన ఇన్ స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసి అభిమానులకు షాక్‌ ఇచ్చారు. దీంతో అమలాపాలా? మజాకా? అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement