సాక్షి, సిటీబ్యూరో : ఓ యువకుడు ఇన్‌స్ట్రాగామ్‌లో యువతిగా మారిపోయాడు. సోషల్‌మీడియా యాప్ ఇన్‌స్ట్రాగామ్‌లో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. దీనిని వినియోగించి ఆమె చేస్తున్నట్లు స్నేహితులు, బంధువులతో అభ్యంతరకర చాటింగ్స్ ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించడంతో శనివారం కేసు నమోదైంది. పంజాగుట్ట అఫీసర్స్ కాలనీకి చెందిన ఓ విద్యార్థినిని టార్గెట్ చేసుకున్న సల్మాన్ ఇజాజ్ అనే యువకుడు ఆమె పేరుతో ఇన్‌స్ట్రాగామ్‌లో నకిలీ ప్రొఫైల్‌తో పాటు ఒక ఐడీ సృష్టించాడు. దీనిని వినియోగించి ఆమె చాటింగ్ చేస్తున్నట్లు స్నేహితులు, బంధువులకు కొన్ని సందేశాలు పంపించాడు. ఇవి అభ్యంతరకరంగా, అశ్లీలంగా ఉండటంతో వారు విషయాన్ని సదరు విద్యార్థిని దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో బాధితురాలు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. సల్మాన్ ఇజాజ్‌పై అనుమానం వ్యక్తం చేయడంతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ అధికారులు సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేస్తున్నారు. సదరు ఐడీకి సంబంధించిన పూర్తి వివరాలు అందించాల్సిందిగా ఇన్‌స్ట్రాగామ్ సంస్థకు లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment