
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా పని చేసిన ఊర్జిత్ పటేల్‌కి కీలక పదవి దక్కింది. ఊర్జిత్ పటేల్‌ను ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించింది. ఏఐఐబీ వ్యవస్థాపక దేశాల్లో భారత్ కూడా ఉంది.
వైస్ ప్రెసిడెంట్
షియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం చైనా రాజధాని బీజింగ్‌లో ఉంది. చైనా తర్వాత రెండో అత్యధిక ఓటింగ్ వాటాతో ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు(ఏఐఐబీ)లో భారత్ వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. ఏఐఐబీకి చైనా మాజీ ఆర్థిక శాఖ వైస్ మినిస్టర్ జిన్ లికున్ నాయకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 1న ఊర్జిత్ పటేల్ ఈ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో బ్రిటానియా కంపెనీలో ఉన్న పదవులకు ఆయన శనివారం రాజీనామా సమర్పించారు. రిజర్వ్ బ్యాంక్‌కి 24వ గవర్నర్‌గా ఊర్జిత్ పటేల్ సేవలు అందించారు. ఆయన గవర్నర్‌గా ఉన్న సమయంలోనే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలతో పొసగపోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
రాజీనామ
ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఆయన బ్రిటానియా సంస్థలో ఇండిపెండెంట్ డైరెక్టర్ కమ్ నాన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కొనసాగుతున్నారు. గత నెలలోనే ఊర్జిత్‌ను వైస్ ప్రెసిడెంట్ నియామక నిర్ణయాన్ని ఏఊఊబీ వెల్లడించింది. గత రెండు వారాలుగా ఈ విషయంపై మౌనంగా ఉన్న ఊర్జిత్ పటేల్.. చివరకు బ్రిటానియాకు తగు సమయం కేటాయించలేకపోతున్నందున రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.