జైట్లీతో ఉర్జిత్ పటేల్ భేటీ | RBI Governor Urjit Patel calls on Finance Minister Arun Jaitley | Sakshi
Sakshi News home page

జైట్లీతో ఉర్జిత్ పటేల్ భేటీ

Published Fri, Sep 9 2016 1:20 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

జైట్లీతో ఉర్జిత్ పటేల్ భేటీ

జైట్లీతో ఉర్జిత్ పటేల్ భేటీ

న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ సమావేశం అయ్యారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత జైట్లీతో పటేల్ మొట్ట మొదటి సమావేశం ఇది. దేశ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై వీరు చర్చించినట్లు భావిస్తున్నారు. అక్టోబర్ 4న ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష కూడా జరగనున్న సంగతి తెలిసిందే.

ఆర్‌బీఐ కీలక రేట్లను మెజారిటీ ప్రాతిపదికన నిర్ణయించడానికి సంబంధించి ఏర్పాటుకానున్న ఆరుగురు సభ్యుల బృందంలో ముగ్గురిని కేంద్రం నియమించాల్సి ఉన్న పరిస్థితుల్లో తాజా సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరు ముగ్గురు కాకుండా ఆర్‌బీఐ నుంచి గవర్నర్‌సహా ముగ్గురు సభ్యులు ఉంటారు. రేటుపై సభ్యులు సమానంగా చీలిపోతే, గవర్నర్ తుది నిర్ణయం కీలకం అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement