![Urjit Patel Quits Stockmarkets Slips - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/11/sensex%20big%20fall.jpg.webp?itok=68rChs1o)
సాక్షి, ముంబై: దేశీయ స్టాకమార్కెట్లు సెన్సెక్స్ 713, నిఫ్టీ 205 పతనమైన కీలక సూచీలు మంగళవారం మరింత కుదేలయ్యాయి. మంగళవారం అదే ధోరణిని కొనసాగిస్తూ సెన్సెక్స్ 350, పాయింట్లు, నిఫ్టీ 127 పాయింట్లు పతనమై ట్రేడ్ అవుతున్నాయి.
ఒకవైపు అంతర్జాతీయ పరిణామాలు, మరోవైపు దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు. దీనికి తోడు దేశ కేంద్ర బ్యాంకులో చోటు చేసుకున్న దిగ్భ్రాంతికర పరిణామం వెరసి దలాల్ స్ట్రీట్లో అమ్మకాల సెగ రేగింది.
ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తి, ప్రభుత్వ పెత్తనమంటూ భారీ బాంబు పేల్చిన ఆర్‌బీఐ గవర్నర్ డా. ఉర్జిత్ పటేల్ నిశ్శబ్ద నిష్క్రమణ ఇన్వెస్టర్లును భారీగా నిరాశపర్చింది. దాదాపు అన్ని రంగాలూ నష్టాల్లోనే. అటు దేశీయ రుపాయి కరెన్సీ కూడా భారీ నష్టాలతో ప్రారంభమైంది. డాలరుమారకంలో ఏకంగా రూపాయికిపైగా పతనమైన 72.35 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది.
మరోవైపు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, మిజోరం, తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠ రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment