పెద్ద నోట్ల రద్దు; మౌనం వీడిన ఆర్బీఐ గవర్నర్
ముంబై: పెద్ద నోట్ల రద్దు, తదనంతర పరిణామాలపై ఎట్టకేలకు రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఊర్జిత్ పటేల్ స్పందించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను రోజువారీగా సమీక్షిస్తున్నామని, కరెన్సీ కోసం ఇబ్బంది పడుతున్న నిజాయితీ పరుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఆదివారం సాయంత్రం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
డిమాండ్‌కు తగినట్టుగా కరెన్సీని ప్రింట్ చేస్తున్నామని ఊర్జిత్ పటేల్ తెలిపారు. బ్యాంకుల్లో నగదు లభ్యత పెరిగిందని వెల్లడించారు. వీలైనంత త్వరలో ఇబ్బందులు తొలగిపోతాయని, సాధారణ పరిస్థితి వస్తుందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఊర్జిత్ పటేల్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రజలు కరెన్సీ కోసం కష్టాలు పడుతుంటే ఊర్జిత్ స్పందించకపోవడంపై సామాన్యుల నుంచి ప్రతిపక్షాల వరకు తప్పుపట్టారు. ఇక నెటిజెన్ల అయితే ఊర్జిత్ పటేల్ అదృశ్యమయ్యారంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.