రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వం మధ్య సంబంధాలు భార్య, భర్తల మధ్య అనుబంధంలాగా ఉండాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఏవైనా భేదాభిప్రాయాలు వస్తే.. ఇరు పక్షాలు సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం, ఆర్‌బీఐ మధ్య విభేదాలతో ఉర్జిత్ పటేల్ ఆర్‌బీఐ గవర్నర్ పదవికి రాజీనామా చేశారన్న విమర్శల నేపథ్యంలో మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ’చేంజింగ్ ఇండియా’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మన్మోహన్ సింగ్ ఈ విషయాలు చెప్పారు. ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిని, స్వతంత్రతను గౌరవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఇటు కేంద్రంతో కలిసి పనిచేస్తూనే అటు పటిష్టంగా, స్వతంత్రంగా కూడా పనిచేసేలా ఉండాలని చెప్పారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వాల రైతు రుణ మాఫీ పథకాలపై స్పందిస్తూ.. ఎన్నికల మేనిఫెస్టోలో హామీలిచ్చిన పక్షంలో తప్పక నెరవేర్చాల్సి ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment