చంపేస్తా అని ఉర్జిత్‌ పటేల్‌కు బెదిరింపు | RBI governor gets threat email | Sakshi
Sakshi News home page

చంపేస్తా అని ఉర్జిత్‌ పటేల్‌కు బెదిరింపు

Published Sun, Mar 5 2017 12:20 PM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM

చంపేస్తా అని ఉర్జిత్‌ పటేల్‌కు బెదిరింపు

చంపేస్తా అని ఉర్జిత్‌ పటేల్‌కు బెదిరింపు

ముంబై‌: ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌కు ఓ వ్యక్తి బెదిరింపు ఈ మెయిల్‌ పంపడం కలకలం రేపింది. ఆర్‌బీఐ గవర్నర్ విధుల నుంచి తప్పుకోకపోతే.. చంపేస్తానంటూ ఓ అగంతకుడు ఉర్జిత్‌ పటేల్‌కు మెయిల్‌ చేశాడు.

ఈ బెదిరింపుల వ్యవహారంపై విచారణ చేపట్టిన ముంబై సైబర్‌ క్రైమ్‌ సెల్‌ పోలీసులు.. 34 ఏళ్ల వైభవ్‌ బదల్వార్‌ అనే వ్యక్తిని నాగ్‌పూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఉర్జిత్ పటేల్‌తో పాటు అతడి కుటుంబసభ్యులను కూడా చంపేస్తానంటూ నిరుద్యోగి అయిన బదల్వార్‌ ఈ మెయిల్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. అతడిని ముంబైకి తరలించిన పోలీసులు.. ఐపీసీ 506(2) సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement