ఉర్జిత్‌కు శాలరీ బొనాంజ.. భారీగా జీతం పెంపు!
ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌తోపాటు డిప్యూటీ గవర్నర్ల జీతాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. వారి మూలవేతనాన్ని ఏకంగా 100శాతం పెంచింది. దీంతో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ నెలకు రూ. 2.50 లక్షల జీతాన్ని అందుకోనుండగా.. డిప్యూటీ గవర్నర్‌లు రూ. 2.25 లక్షల జీతాన్ని పొందనున్నారు. ఈ పెంపు గడిచిన ఏడాది (2016) జనవరి 1 నుంచి అమలుకానుండటం గమనార్హం.
ఇప్పటివరకు ఆర్బీఐ గవర్నర్‌కు రూ. 90వేల నెలవారీ జీతం అందుతుండగా, ఆయన డిప్యూటీలకు రూ. 80వేల జీతం అందుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం వారి వేతనాల అంశాన్ని సమీక్షించి.. జీతాలలో ఈ మేరకు మార్పులు చేసింది. భారీస్థాయిలో ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్ జీతాలను కేంద్రం పెంచినప్పటికీ.. ఆర్బీఐ నియంత్రిస్తున్న పలు బ్యాంకుల్లోని టాప్ అధికారులతో జీతాలతో పోలిస్తే.. వారికి తక్కువ వేతనమే లభిస్తుండటం గమనార్హం.