ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : నోట్ల రద్దు, బ్యాంకుల్లో మొండి బకాయిల (ఎన్‌పీఏ)పై వివరణ ఇచ్చేందుకు ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ మంగళవారం ఆర్థిక వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట హాజరయ్యారు. సమావేశంలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై ఆయన పదిరోజుల్లో లిఖితపూర్వకంగా బదులిస్తారు. పార్లమెంటరీ కమిటీ సభ్యులతో సంప్రదింపుల సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ ముడిచమురు ధరలు, భారత ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం గురించి చర్చించినట్టు సమాచారం.
నోట్ల రద్దు, బ్యాంకుల్లో ఎన్‌పీఏల పరిస్థితి పర్యవసానాలపై సభ్యులు ఆర్బీఐ గవర్నర్‌ను ప్రశ్నించారు. మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ ఆధ్వర్యంలో 31 మంది సభ్యులున్న ఈ కమిటీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. కాగా ఆర్బీఐ నిర్వహణ వ్యవహరాల్లో ఇటీవల కేంద్ర జోక్యం పెరిగిందన్న విమర్శల నేపథ్యంలో సెక్షన్ 7ను ప్రయోగించారనే ప్రచారంపై పార్లమెంటరీ కమిటీ ఊర్జిత్ పటేల్‌ను ప్రశ్నించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment