ఆర్‌బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : పీఎన్‌బీ స్కామ్‌కు సంబంధించి ఆర్‌బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్‌ను మంగళవారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశ్నించింది. వీరప్ప మొయిలీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశానికి హాజరైన ఊర్జిత్ పటేల్‌ను సభ్యులు నీరవ్ మోదీ-పీఎన్‌బీ స్కామ్‌పై ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. నకిలీ పత్రాలతో రూ 13,000 కోట్ల రుణాలు పొందిన నీరవ్ మోదీ ఉదంతం బ్యాంకింగ్ వ్యవస్థలో పెను ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే.
ఈ కుంభకోణాన్ని దీర్ఘకాలంగా ఎందుకు గుర్తించలేకపోయారని స్టాండింగ్ కమిటీ సభ్యులు ఊర్జిత్ పటేల్‌ను ప్రశ్నించారు. ఈ భేటీలో బ్యాంకుల్లో పేరుకుపోతున్న నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ)పైనా ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. బ్యాంకుల్లో మొండిబకాయిల వసూలు ప్రక్రియ ప్రారంభమైందని పటేల్ కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా వివరించారు. గతంలో మే 17న కూడా ఆర్‌బీఐ గవర్నర్ స్టాండింగ్ కమిటీ ఎదుట హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment