questioned
-
లిక్కర్ స్కాంలోకి ఎలా వచ్చారు?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు ఈ లిక్కర్ స్కాంలోకి ఎవరి ప్రోద్బలంతో వచ్చారనే ప్రశ్నతో సీబీఐ శనివారం విచారణను ప్రారంభించింది. ఈ స్కాంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతలు, హైదరాబాద్‌కు చెందిన వ్యాపార వేత్త అరుణ్ పిళ్లై, పారిశ్రామిక వేత్త శరత్‌చంద్రరెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సమీర్ మహేంద్రు, విజయ్‌నాయర్, దినేష్‌ల పాత్రపై, వీరికి కవితతో ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై కవితను విచారించింది. రూ.100 కోట్ల నగదు చేతులు మారిందని, దీన్ని గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారని, ఎవరెవరు ఎంత ఇచ్చారు, ఎంత అందుకున్నారు అనే అంశాలను శుక్రవారం సీబీఐ కోర్టుకు తెలిపింది. వీటిపైనా శనివారం సీబీఐ కవితను ప్రశ్నించింది. ఏ ఆఫర్ ఇస్తే ఒప్పుకున్నారు? ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో మహిళా అధికారి సమ క్షంలో ముగ్గురు అధికారులు కవితను రెండున్నర గంట లపాటు విచారించారు. ఈ స్కాంలో మీరే కింగ్‌పిన్‌గా ఉన్నారని ఇప్పటికే పలువురు వాంగ్మూలం ఇచ్చిన విష యాన్ని కవితకు గుర్తు చేశారు. లిక్కర్ స్కాం విషయమై ముందుగా మిమ్మల్ని ఎవరు కలిశారు? ఏ ఆఫర్ ఇస్తే మీరు ఒప్పుకున్నారు? రూ.100 కోట్లకు సంబంధించి ఎవరెవర్ని ఏవిధంగా భాగస్వాముల్ని చేశారో చెప్పాలని ప్రశ్నించినట్లు సమాచారం. తాను ఎవర్నీ భాగస్వాముల్ని చేయలేదని, ఎవర్నీ భయపెట్టలేదని, ఎవరి నుంచి ముడుపులు అందుకోలేదని కవిత బదులిచ్చినట్లుగా తెలిసింది. లిక్కర్ స్కాంతో మీకు సంబంధం లేకపోతే వ్యాపారవేత్త శరత్‌చంద్రారెడ్డిని భయపెట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించినట్లు సమాచారం. మొబైల్స్‌ను ఎందుకు ధ్వంసం చేశారు? ఈ వ్యవహారంలో ఏ ఆధారాలు లభించకుండా జాగ్రత్తలు తీసుకున్న మీరు సమీర్ మహేంద్రుతో ఫేస్ టైమ్ ఆడియో కాల్ ద్వారా ఏం మాట్లాడారని సీబీఐ కవితను ప్రశ్నించినట్లు తెలిసింది. అదేవిధంగా కేజ్రీవాల్‌తో ఫేస్ టైమ్ ఆడియో కాల్ ద్వారా మాట్లాడారా? అంటూ ప్రశ్నించినట్లు సమాచారం. ‘ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో అరుణ్ పిళ్లై, విజయ్‌నాయర్, దినేష్‌లను మీరు కలిసినట్లుగా దినేష్ ఆరోరా వాంగ్మూలంలో చెప్పాడు... ఆ సమయంలో మీరు వారిని కలిసి రూ.100 కోట్ల ముడుపుల విషయంపై చర్చించినట్లు తెలిసింది. కేజ్రీవాల్ నుంచి మీకు ఏదైనా సమాచారం వచ్చిందా? ఆప్ నేతలు ఎవరెవరు కేజ్రీవాల్ పేరును మీ వద్ద ప్రస్తావించారు? మీరు తప్పు చేయనట్లైతే మొబైల్ ఫోన్లను ధ్వంసం చేయాల్సిన అవసరం ఏంటి’ అంటూ సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం. కవితతో.. భర్త, న్యాయవాది భేటీ సీబీఐ విచారణ ముగిసిన తర్వాత కవితను సీబీఐ కార్యాలయంలో భర్త అనిల్, న్యాయవాది మోహిత్‌రావు, పీఏ శరత్ కలిశారు. సీబీఐ విచారించిన విషయాలపై అనిల్, మోహిత్‌రావు సుదీర్ఘంగా చర్చించారు. కవిత క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్న అనిల్.. ఆమెకు ధైర్యం చెప్పారు. న్యాయం దిశగా అడుగులు వేద్దామని భరోసా ఇచ్చారు. కవితను సోమవారం సీబీఐ కోర్టులో హాజరుపరచనున్న నేపథ్యంలో వాదించాల్సిన విషయాలపై మోహిత్‌రావు కవితతో చర్చించినట్లు తెలిసింది. -
ఆ కార్లు ఎక్కడివి?
సాక్షి, హైదరాబాద్: ఆ కార్లు ఎక్కడివి..ఎవరు బహుమతిగా ఇచ్చారు? ఒకవేళ మీరే కొంటే..అందుకు సొమ్ము ఎక్కడిది? అంటూ మూడో రోజు కస్టడీలో ఏసీబీ అధికారులు హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ప్రశ్నించినట్టు తెలిసింది. ఏసీబీకి పట్టుబడడానికి కొద్ది నెలల కిత్రమే రెండు కొత్త కార్లు శివబాలకృష్ణకు బహుమతిగా వచ్చినట్టు ఏసీబీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఇందులో హోండాసిటీ కారును ఓ బిల్డర్, నెక్సాన్ కారు ఓ రియల్‌బ్రోకర్ నుంచి బహుమతిగా వచ్చినట్టుగా ప్రాథమిక ఆధారాల మేరకు అనుమానిస్తున్నారు. ఈ రెండు కార్ల విషయంతోపాటు కుటుంబసభ్యులు, ఇతర బినామీల పేరిట నడుపుతున్న పలు బ్యాంకు ఖాతాలు, లాకర్ల వివరాలపైనా ఏసీ బీ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. శివ బాలకృష్ణ భార్య బంధువు భరత్ పేరిట మరో మూడు లాకర్లు ఉన్నట్టు గుర్తించారు. ఎనిమిది రోజుల కస్టడీలో భాగంగా శుక్రవారం మూడో రోజు శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. తొలిరోజు విచారణలో భాగంగా బుధవారం ఏడు గంటలు, గురువారం ఆరుగంటలపాటు శివబాలకృష్ణను ఏసీబీ అధికారుల బృందం ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే, శుక్రవారం విచారణలో భాగంగా ఉద యం చంచల్‌గూడ జైలు నుంచి శివబాలకృష్ణను తమ కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు తొలుత రెరా కార్యాలయానికి వెళ్లినట్టు సమాచారం. అక్కడ సోదా ల్లో రూ.కోటి విలువైన ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు స్వా«దీనం చేసుకున్నట్టు తెలిసింది. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్‌లోని ఏసీబీ కేంద్ర కార్యాలయానికి తీసుకొచ్చి ప్రశ్నించారు. అయితే తొలి రెండు రోజులు ఏసీబీ విచారణకు సహకరించకపోయినా, వరుసగా కీలక పత్రాలు ముందుంచి తమదైన శైలిలో ప్రశి్నస్తుండడంతో శివబాలకృష్ణ కొన్ని ప్రశ్నలకు ఏసీబీ అధికారులకు సమాధానాలు ఇస్తున్నట్టు తెలిసింది. లాకర్లలో భారీగా బంగారం? శివబాలకృష్ణ, ఆయన కుటుంబసభ్యుల పేరిట ఉన్న బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు తెరిపించినట్టు సమాచారం. ఈ లాకర్లలో పెద్ద మొత్తంలో దాచిన బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అయితే ఎంతమేర బంగారం, ఇతర పత్రాలు స్వా«దీనం చేసుకున్నారన్న సమాచారం పూర్తిగా తెలియరాలేదు. కాగా, ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత శివబాలకృష్ణపై మరికొందరు ఏసీబీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేస్తుండడంతో ఏసీబీ అధికారులు ఆ అంశాలపైనా ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. శనివారం మరోమారు ఏసీబీ అధికారులు శివబాలకృష్ణను కస్టడీకి తీసుకొని ప్రశ్నించనున్నారు. -
బోనస్‌పై జుకర్‌బర్గ్‌ను నిలదీసిన ఉద్యోగులు
ఓ వైపు లేఆఫ్స్ పేరుతో వేలకొద్దీ ఉద్యోగులను తొలగిస్తున్న సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ మెటా మరోవైపు అందులో పనిచేస్తున్న టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు రూ.కోట్ల కొద్దీ బోనస్‌లు ప్రకటించింది. దీనిపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు కంపెనీ సీఈవో మార్క్జుకర్బర్గ్నే నేరుగా నిలదీశారు. మెటా ఇప్పటి వరకు 21,000 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. తొలి రౌండ్ తొలగింపులను 2022 నవంబర్‌లో ప్రకటించగా, రెండో రౌండ్ లేఆఫ్‌లను గత నెలలోనే ప్రకటించింది. మొదటి రౌండ్లో 11 వేల మంది ఉద్యోగాలు కోల్పోగా, రెండో రౌండ్లో 10 వేల మందికి పింక్ స్లిప్ ఇచ్చారు. మరోవైపు కొంతమంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు కంపెనీ భారీ బోనస్‌లను ఇచ్చింది. కంపెనీలో లేఆఫ్స్ పేరుతో వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో కొంతమంది ఉన్నత స్థాయి ఉద్యోగులకు పెద్ద మొత్తంలో బోనస్‌లను అందించడంపై చాలా మంది ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘వాళ్ల పని నచ్చింది.. అందుకే బోనస్లిచ్చాం’ వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం ప్రకారం.. మార్క్ జుకర్‌బర్గ్ రెండు రోజుల క్రితం వర్చువల్ క్యూఅండ్ఏ (Q&A) సెషన్లో ఉద్యోగులతో మాట్లాడారు. అదే సెషన్లో కొంతమంది ఉద్యోగులు.. ఓ వైపు వేలకొద్దీ తొలగింపులు జరుగుతున్నప్పుడు ఉన్నతస్థాయి ఉద్యోగులకు ఇంత పెద్ద మొత్తంలో బోనస్‌లు ఇవ్వడం వెనుక కారణాన్ని చెప్పాలని జుకర్‌బర్గ్‌ను అడిగారు. జుకర్‌బర్గ్ దీనికి స్పందిస్తూ వారికి అప్పగించిన బాధ్యతలను చక్కగా నిర్వర్తించారని, వారి పనితీరు పట్ల తాము సంతోషంగా ఉన్నందునే బోనస్‌లు ఇచ్చినట్లు బదులిచ్చారు. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! ‘ఉత్సాహంగా, అంకితభావంతో పనిచేస్తున్న ప్రతిభావంతులైన చాలా మంది ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీశారు. ఇలాంటి పరిస్థితిలో మెటా సంస్థలో ఉద్యోగులు ఎందుకు ఉండాలి’ మరో ఉద్యోగి ప్రశ్నించారు. మెటా స్థాయిలో సామాజిక అనుభవాలను మరే ఇతర సంస్థ అందించదని, బిలియన్ల కొద్దీ ప్రజలను చేరుకోవాలనుకుంటే, భారీ ప్రభావాన్ని చూపాలనుకుంటే ఇదే గొప్ప సంస్థ అని జుకర్‌బర్గ్ సమాధానమిచ్చారు. టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు ఇచ్చిన బోనస్‌లు ఇలా.. ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన మెటా ఎస్ఈసీ ఫైలింగ్‌లో టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు ఇచ్చిన బోనస్‌లు గురించి వెల్లడైంది. ఫైలింగ్ ప్రకారం.. సీఎఫ్‌వో సుసాన్లీ 5,75,613 డాలర్ల (రూ. 4.71 కోట్లు) , సీపీఓ క్రిస్టోపర్ కాక్స్ 9,40,214 డాలర్లు (రూ. 7.70 కోట్లు) బోనస్‌గా పొందారు. అలాగే సీవోవో జేవియర్ ఒలివాన్ 7,86,552 డాలర్లు (రూ. 6.44 కోట్లు), సీటీవో ఆండ్రూ బోస్వర్త్ 7,14,588 డాలర్లు (రూ. 5.85 కోట్లు) బోనస్ అందుకున్నారు. ఇక చఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ (సీఎస్‌వో) డేవిడ్ వెన్నర్ 712,284 డాలర్లు (రూ. 5.83 కోట్లు), మాజీ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్ 2,98,385 డాలర్లు (రూ. 2.44 కోట్లు) బోనస్ పొందారు. ఇదీ చదవండి: కారణం లేకుండానే.. బ్రియాన్ హంఫ్రీస్‌ను తొలగించిన కాగ్నిజెంట్! -
‘పరీక్షా పే’ చర్చలో అక్షర.. 9వ తరగతి విద్యార్థినికి ప్రధాని మోదీ సమాధానం
సాక్షి, హైదరాబాద్ (రాయదుర్గం): ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రశ్నించే అవకాశం శేరిలింగంపల్లి గోపన్‌పల్లిలోని జవహర్ నవదోయ విద్యాలయలోని 9వ తరగతి చదివే ‘అక్షర’కు కలిగింది. ఈ కార్యక్రమంలో అక్షర వీడియో ద్వారా ప్రధాని నరేంద్రమోదీని ‘మల్టిపుల్ ల్యాంగ్వేజ్‌లను నేర్చుకోవడానికి విద్యార్థులు ఏమి చేయాలి?’ అని ప్రశ్నించింది. పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ఈ ప్రశ్నను ఇద్దరు విద్యార్థినిలు ప్రధాని దృష్టికి తేగా ఆయన స్పందిస్తూ దేశంలోని ప్రతి విద్యార్థి కూడా తన మాతృభాషతోపాటు ఇతర భాషలు కూడా నేర్చుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక వాక్యం మాట్లాడడానికి అవకాశం కలిగేలా చూడాలని కోరారు. దేశంలో ఎన్న భాషలు ఉన్నాయో..వాటన్నింటిని నేర్చుకోవడానికి ప్రయత్నించాలని విద్యార్థులకు ప్రధాని మోదీ సూచించారు. ప్రధాని ప్రతిష్టాత్మకంగా ప్రతియేటా నిర్వహిస్తున్న ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో మొదటిసారిగా జవహర్నవోదయ విద్యాలయ విద్యార్థినికి అవకాశం కలుగడం విశేషం. ఈ కార్యక్రమాన్ని గురువారం ఉదయం శేరిలింగంపల్లి గోపన్‌పల్లిలోని జవహర్నవోదయ విద్యాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రొజెక్టర్ ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ డానియల్ రత్నకుమార్ ఆధ్వర్యంలో తిలకించారు. అక్షర ప్రశ్న వచ్చే సమయంలో జేఎన్వీ విద్యార్థులంతా కేరింతలు కొడుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమం అనంతరం అక్షరను అభినందించారు. జేఎన్వీకి అవకాశం రావడం సంతోషకరం జాతీయ స్థాయి కార్యక్రమం ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో జేఎన్వీ రంగారెడ్డి జిల్లా విద్యార్థినికి అవకాశం రావడం సంతోషంగా ఉందని ప్రిన్సిపాల్ డానియల్ రత్నకుమార్ సంతోషం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఈ కార్యక్రమానికి 9వ తరగతి విద్యార్థిని అక్షర ఎంపిక కావడం, ఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి వచ్చి వీడియో షూట్ ద్వారా అక్షర ప్రశ్నను తీసుకొని వెళ్లడం జరిగిందన్నారు. చదవండి: ‘తల్లిని చూసి నేర్చుకోండి.. లైఫ్‌లో షార్ట్ కట్స్ వద్దు’ -
ఈటల గెలిస్తే ప్రభుత్వం కూలుతుందా?
కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ గెలిస్తే ప్రభుత్వం కూలిపోతుందా? అని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీలవి రాజకీయ డ్రామాలని, లోపాయికారి ఒప్పందంతోనే విమర్శలు చేసుకుంటున్నారన్నారు. బీఎస్పీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రగతిభవన్‌పై నీలిజెండా ఎగురవేసి బహుజనభవన్‌గా మార్చడమే లక్ష్యంగా ముం దుకుసాగాలన్నారు. చదవండి: కృష్ణా జలాల వివాదం తెలుగు రాష్ట్రాలకే పరిమితం బీఎస్పీ అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కు పవర్ కట్‌చేసి బహుజనుల పవర్ ఏంటో చూపుతా మన్నారు. మంత్రి మల్లారెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్న తీరు ప్రజాస్వామ్యానికి తలవంపులు తెచ్చేలా ఉందని, మల్లారెడ్డిని సమాజం నుంచి బహిష్కరించాలని కోరారు. ఉపఎన్నికలు వస్తేనే ఉద్యోగ నోటిఫికేషన్లు గుర్తుకొస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వేరోస్ సభ్యులతోపాటు వివిధ పార్టీ్టలకు చెందిన కార్యకర్తలు బీఎస్పీలో చేరారు. చదవండి: మనోళ్లకు ‘బీపీ’ ఎక్కువే! -
పెగాసస్ వ్యవహారంపై కేంద్ర మాజీ మంత్రి స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: పెగాసస్ ట్యాపింగ్ కుంభకోణంపై కేంద్ర ఐటీ శాఖమాజీమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ఇజ్రాయెల్ స్పైవేర్ తయారీ సంస్థ ఎన్ఎస్ఓ ప్రకారం పెగాసెస్‌ను 45 దేశాలు ఉపయోగిస్తున్నప్పుడు భారతదేశం మాత్రమే ఎందుకు దాడి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాజకీయ నాయకులు, ప్రముఖ జర్నలిస్టులతో సహా భారతదేశంలో 300 మందిఫోన్లను కేంద్రం ట్యాప్ చేసిందన్న ది వైర్ కథనం మోదీ సర్కార్‌ను ఇరుకునపెట్టింది. దీంతో కేంద్ర మాజీమంత్రి కేంద్రప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే పనిలో పడ్డారు. కాగా ఫోన్లను ట్యాప్ చేసిన ప్రముఖుల జాబితాలో కాంగ్రెస్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ , అతని ఇద్దరు సహాయకులు ఉన్నారని ది వైర్ నివేదించింది. వీరితో పాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా కూడా ఉన్నారని తెలిపింది. దీనిపై పార్లమెట్ సమావేశాల ప్రారంభం మొదటి రోజే తీవ్ర దుమారం రేపింది. -
ఈసీపై కేజ్రీవాల్ ఆగ్రహం
-
ఈసీ అధికారులు నిద్రపోతున్నారా? : కేజ్రీవాల్
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు శనివారం జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 70స్థానాలున్న అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసి 24 గంటలయిన ఎన్నికల కమీషన్ మాత్రం అధికారికంగా పోలింగ్ శాతాన్ని ప్రకటించలేదు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)నే మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి కానీ బీజేపీ మాత్రం ఎగ్జిట్ పోల్స్ రివర్స్ అవుతాయని.. అమిత్ షా చెప్పినట్లు 45 సీట్లకు తక్కువ కాకుండా తామే గద్దెనెక్కుతామని ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇప్పటిదాకా తుది పోలింగ్ శాతంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో అనుమానాలకు తావిచ్చినట్లయింది. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల కమీషన్‌పై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు.(కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ నేత ప్రశంసలు..) 'పోలింగ్ పూర్తయిన ఇన్ని గంటల తర్వాత కూడా ఓటింగ్ శాతంపై ఈసీ ప్రకటన చేయకపోవడం నాకైతే షాకింగ్‌గా అనిపిస్తోంది. అసలు ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్లేమైనా నిద్రపోతున్నారా ఏంటి? పోలింగ్ శాతాన్ని ప్రకంచాలి కదా?' అంటూ సీఎం కేజ్రీవాల్ ఈసీని ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఆయన ట్వీట్ చేశారు. కేంద్రంలోని బీజేపీకి ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తున్నదని, ట్యాంపరింగ్ ద్వారా పోలింగ్ శాతాన్ని పెంచుకుని, తద్వారా ఫలితాల్ని తారుమారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.(బీజేపీలో సరైన సీఎం అభ్యర్ధి లేరు..) Absolutely shocking. What is EC doing? Why are they not releasing poll turnout figures, several hours after polling? https://t.co/ko1m5YqlSx — Arvind Kejriwal (@ArvindKejriwal) February 9, 2020 శనివారం సాయంత్రానికి వెల్లడైన లెక్కల ప్రకారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 61.46 శాతం పోలింగ్ నమోదైంది. గత లోక్ సభ ఎన్నికలు, 2015నాటి అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి పోలింగ్ శాతం చాలా తక్కువగా ఉంది. 2015లో ఢిల్లీ అసెంబ్లీకి 67.5 శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పుడు కూడా శాతం లెక్కలు పెరుగుతాయని ఈసీ అధికారులు చెప్పినా... అధికార లెక్కలు మాత్రం విడుదల చేయకపోవడం పట్ల విమర్శలకు దారి తీస్తోంది. (ఢిల్లీ ఎన్నికలు : కేజ్రీవాల్, స్మృతి ఇరానీ ట్వీట్ వార్) అయితే కేజ్రీవాల్ ఎలక్షన్ కమీషన్ తీరును తప్పు బట్టిన కాసేపటికే కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతాన్ని అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 62.59 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. కాగా 2015 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 5శాతం తగ్గిందని పేర్కొన్నారు. అయితే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల కంటే 2శాతం ఎక్కువగా నమోదైందని అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో అత్యల్పంగా 45.4 శాతం, బల్లిమారన్ నియోజకవర్గంలో అత్యధికంగా 71.6శాతం పోలింగ్ నమోదైందని ఈసీ తమ ప్రకటనలో తెలిపింది. -
ఆర్బీఐ గవర్నర్‌ను ప్రశ్నించిన పార్లమెంటరీ కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ : పీఎన్బీ స్కామ్‌కు సంబంధించి ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్‌ను మంగళవారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశ్నించింది. వీరప్ప మొయిలీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశానికి హాజరైన ఊర్జిత్ పటేల్‌ను సభ్యులు నీరవ్ మోదీ-పీఎన్బీ స్కామ్‌పై ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. నకిలీ పత్రాలతో రూ 13,000 కోట్ల రుణాలు పొందిన నీరవ్ మోదీ ఉదంతం బ్యాంకింగ్ వ్యవస్థలో పెను ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణాన్ని దీర్ఘకాలంగా ఎందుకు గుర్తించలేకపోయారని స్టాండింగ్ కమిటీ సభ్యులు ఊర్జిత్ పటేల్‌ను ప్రశ్నించారు. ఈ భేటీలో బ్యాంకుల్లో పేరుకుపోతున్న నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ)పైనా ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. బ్యాంకుల్లో మొండిబకాయిల వసూలు ప్రక్రియ ప్రారంభమైందని పటేల్ కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా వివరించారు. గతంలో మే 17న కూడా ఆర్బీఐ గవర్నర్ స్టాండింగ్ కమిటీ ఎదుట హాజరయ్యారు. -
చిదంబరంను ప్రశ్నించిన ఈడీ
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ. చిదంబరంను మంగళవారం ఈడీ ప్రవ్నించింది. కేసులో సంబంధిత పత్రాల ఆధారంగా చిదంబరంను ఈడీ అధికారులు దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించారు. రూ 3,500 కోట్ల పైబడిన ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంలో ఆర్థిక మంత్రి పాత్రపై అప్పటి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎఫ్ఐపీబీ) అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కూడా ఈడీ చిదంబరంను ప్రశ్నించినట్టు సమాచారం. ఈడీ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు చేరుకున్న చిదంబరంను అప్పటికే ప్రశ్నలతో సిద్ధమైన అధికారులు పలు కోణాల్లో ఆయన నుంచి సమాధానాలు రాబట్టారు. ఇక మధ్యాహ్నం గంటపాటు భోజన విరామ సమయం ఇచ్చిన అధికారులు అనంతరం తిరిగి విచారణ చేపట్టారు. ఈ కేసులో మరోసారి చిదంబరంను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎఫ్ఐపీబీ ఆమోదానికి సంబంధించి దాదాపు 54 పైళ్లు ఈడీ పరిశీలనలో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలకు అక్రమంగా ఎఫ్ఐపీబీ ఆమోదం లభించినట్టు ఈడీ ఆరోపిస్తోంది. -
ఇన్నాళ్లూ ఏమయ్యారు
భీమవరం : గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణానికి సహకరించాలని అడిగేందుకు వెళ్లిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)కు చేదు అనుభవం ఎదురైంది. భీమవరం మండలం తుందుర్రును ఆనుకుని ఉన్న జొన్నలగరువు గ్రామానికి సోమవారం రాత్రి ఎమ్మెల్యే వెళ్లగా, గ్రామస్తులు ఆయనను చుట్టుముట్టారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు సోమవారం సాయంత్రం కంసాలి బేతపూడిలోని ఓ కాలనీకి రహస్యంగా వెళ్లిన అంజిబాబు ఫుడ్‌పార్క్ అనుకూల వర్గానికి చెందిన కొందరితో మాట్లాడారు. అనంతరం జొన్నలగరువు గ్రామంలోని చర్చిలో సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే చర్చి వద్దకు చేరుకోగానే అక్కడి ప్రజలు ఆయనను చుట్టుముట్టారు. చర్చిలో సమావేశాలు వద్దని, ఏమైనా ఉంటే బయటే నిలబడి మాట్లాడాలని పట్టుబట్టారు. దీంతో ఎమ్మెల్యే ప్రజల మధ్య నిలబడి ఫుడ్‌పార్క్ నిర్మాణం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటూ వారిని బుజ్జగించే ప్రయత్నం చేయగా మహిళలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ‘ఆక్వా పార్క్ వద్దంటూ రెండున్నరేళ్లుగా ఆందోళనలు చేస్తుంటే మీకు ఇప్పుడు గుర్తొచ్చామా.. సామాన్య జనంపై కేసులు పెట్టినప్పుడు, 144 సెక్షన్ పెట్టి ప్రజల్ని వేధించినప్పుడు ఏమయ్యార’ని నిల దీయడంతో ఎమ్మెల్యే కంగుతిన్నారు. ‘ఆక్వా పార్క్ కట్టొద్దంటూ మీరెవరూ నా దగ్గరకు రాలేదు’ అని చెప్పే ప్రయత్నం చేయగా.. ‘అనేకసార్లు వినతి పత్రాలతో మీ ఆఫీసుకొచ్చాం. వాటిని చెత్తబుట్టలో వేసి ఆక్వా పార్క్ యాజ మాన్యానికి కొమ్ముకాస్తున్నార’ంటూ మహిళలు దుయ్యబట్టారు. ‘హైదరాబాద్‌లో ఉండే వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి మా ఇబ్బందులు తెలియడంతో ఆయనే స్వయంగా ఇక్కడికొచ్చి మాకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ప్రజలకు హాని కల్గించే ఫ్యాక్టరీలు నివాసాల మధ్య కట్టడం మంచిది కాదని చెప్పారు. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీకు మాత్రం మా ఇబ్బందులు పట్టవా’ అని నిలదీశారు. తాను ఫ్యాక్టరీ కావాలన్న వారికే అండగా ఉంటానన్న అంజి బాబు, టీడీపీ నేతలు వెళ్లిపోయారు. అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య కొట్లాట ఇదిలావుండగా, ఎమ్మెల్యే అంజిబాబు జొన్నలగరువు రావడంతో ఆక్వా పార్క్ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య చిచ్చు రగిలింది. రెండువర్గాల తోపులాట జరిగి కొట్లాటకు దారితీసింది. జొన్నలగరువు గ్రామస్తులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే వెనుదిరగగా.. ఆక్వా పార్క్ అనుకూల, వ్యతిరేక వర్గాలు కొట్లాటకు దిగటంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఎమ్మెల్యే, ఫుడ్‌పార్క్ యాజమాన్యం పెంచిపోషిస్తున్న వర్గం పోలీసుల సమక్షంలోనే తమను దూషిస్తూ కొట్లాటకు దిగిందని గ్రామానికి చెందిన కొయ్యే లూసీ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. -
మీరంతా ఏం చేస్తున్నారు?
పెరవలి : జిల్లాలో సాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవలసిన బాధ్యత ఇరిగేషన్ అధికారులదేనని, మీరంతా ఏం చేస్తున్నారని ఇరిగేషన్ అ«ధికారులను కలెక్టర్ కాటంనేని భాస్కర్ నిలదీశారు. నీరు సమృద్ధిగా ఉన్నా సాగు నీరు అందకపోవటానికి కారణమేమిటని ప్రశ్నించారు. పెరవలి లాకుల వద్ద మంగళవారం ఉదయం ఆయన నీటి ప్రవాహాన్ని పరిశీలించి అధికారులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. పెరవలి లాకులకు ఏటాలాగే 1,200 క్కూసెక్కుల నీరు విడుదలవుతున్నా నీరు పొలాలకు ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు. చిన్న, పిల్ల కాలువలకు నీరు ఎక్కకపోతే వంతుల వారీ విధానం ప్రవేశపెట్టి సాగునీరు సక్రమంగా అందించాల్సిన బాధ్యత మనదేనన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమస్యను పరిష్కరించి సాగునీరు సక్రమంగా ఇవ్వాలని ఆదేశించారు -
మంత్రి సునీతకి చేదు అనుభవం
-
ప్రశ్నించే పవన్‌ను ప్రశ్నిస్తాం
-
ఏపీ ప్రభుతాన్ని ఏకిపారేసిన జాతీయఛానల్
-
ఎన్‌కౌంటర్‌పై బాబు నోరెందుకు విప్పరు?
సీపీఎం తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణన్ ధ్వజం (విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): శేషాచలం ఎన్‌కౌంటర్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నోరెందుకు మెదపరని సీపీఎం తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి జి.రామకృష్ణన్ ప్రశ్నించారు. పక్కావ్యూహంతో అమాయక గిరిజనులు 20 మందిని అన్యాయంగా కాల్చి చంపారని దుయ్యబట్టారు. ఈ సంఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సీపీఎం 21వ జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన రామకృష్ణన్ సాక్షి ప్రతినిధితో శుక్రవారం మాట్లాడారు. ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బొజ్జల ఓ తమిళ టీవీచానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ను తప్పుపట్టారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం: లక్ష్మణ్
హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అధికారపక్ష వైఫల్యాలను ఎండగడతామని బీజేఎల్పీనేత డా.కె.లక్ష్మణ్ చెప్పారు. ప్రభుత్వాన్ని నిలదీసి అసెంబ్లీ నియమనిబంధనలకు అనుగుణంగా సభను స్తంభింపచేసైనా సమాధానాన్ని రాబడతామన్నారు. ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో ఉన్న శ్రద్ధ పాలనపై లేదని విమర్శించారు. పాలన పూర్తిగా గాడి తప్పిందని ధ్వజమెత్తారు. ఫిరాయింపులపై స్పీకర్‌కు, మండలిచైర్మన్‌కు హైకోర్టు నోటీసులిచ్చినా అధికారపక్షం విలువలు లేని రాజకీయాలు నడుపుతోందన్నారు.బీజేఎల్పీగా ప్రజల పక్షాన నిలిచి సమస్యలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలను సాధించేందుకు అసెంబ్లీ వేదికగా ఉపయోగించుకుంటామన్నారు. ముఖ్యమైన సమస్యలపై టీడీపీతోనే కాకుండా కాంగ్రెస్, లెఫ్ట్‌లతో కలిసి సభలో సమన్వయంతో వ్యవహరిస్తామన్నారు. శుక్రవారం పార్టీ నాయకులు ఎస్.కుమార్,పి.రాములుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటిందని, కొత్త రాష్ర్టం, కొత్తప్రభుత్వంగా ఇచ్చిన గడువు కూడా తీరిపోయిందన్నారు.ఫిబ్రవరి చివరి వరకు బడ్జెట్ అమలు తీరును పరిశీలిస్తే గొప్పలకు పోయి రూ.లక్ష కోట్లకు పెట్టినట్లుగా తెలుస్తోందన్నారు. గత బడ్జెట్లో చాలా మటుకు ఎన్నికల హామీల ప్రస్తావనే లేదన్నారు. జలహారం, చెరువుల పునరుద్ధరణ, పింఛన్లు, కల్యాణలక్ష్మి, దళితులకు భూ పంపిణీ వంటివి పేర్కొన్నా ఆచరణలో ఇవి అమలుకు నోచుకోలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా శనివారం జీహేచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి శాసనసభ వరకు 5గురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతల పాదయాత్రను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్డీఏకు టీఆర్ఎస్ మద్దతునిస్తుందనేది ఊహాజనితమైన ప్రశ్న అని ఇచ్చిన హామీల అమలుకు పనిచేస్తే ప్రభుత్వానికి సహకరిస్తామని, దాని నుంచి వైదొలిగితే వదిలే ప్రసక్తే ఉండదని ఒక ప్రశ్నకు లక్ష్మణ్ బదులిచ్చారు. -
జమ్ము కాశ్మీర్ క్రికెటర్స్ ను ప్రశ్నించిన పోలీసులు