ఈటల గెలిస్తే ప్రభుత్వం కూలుతుందా? | Rs Praveen Kumar Comments On Etela Rajender | Sakshi
Sakshi News home page

ఈటల గెలిస్తే ప్రభుత్వం కూలుతుందా?

Published Fri, Aug 27 2021 4:03 AM | Last Updated on Fri, Aug 27 2021 8:20 AM

Rs Praveen Kumar Comments On Etela Rajender - Sakshi

కరీంనగర్‌: హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌ గెలిస్తే ప్రభుత్వం కూలిపోతుందా? అని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్, బీజేపీలవి రాజకీయ డ్రామాలని, లోపాయికారి ఒప్పందంతోనే విమర్శలు చేసుకుంటున్నారన్నారు. బీఎస్పీ కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రగతిభవన్‌పై నీలిజెండా ఎగురవేసి బహుజనభవన్‌గా మార్చడమే లక్ష్యంగా ముం దుకుసాగాలన్నారు. చదవండి: కృష్ణా జలాల వివాదం తెలుగు రాష్ట్రాలకే పరిమితం

బీఎస్పీ అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌కు పవర్‌ కట్‌చేసి బహుజనుల పవర్‌ ఏంటో చూపుతా మన్నారు. మంత్రి మల్లారెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతున్న తీరు ప్రజాస్వామ్యానికి తలవంపులు తెచ్చేలా ఉందని, మల్లారెడ్డిని సమాజం నుంచి బహిష్కరించాలని కోరారు. ఉపఎన్నికలు వస్తేనే ఉద్యోగ నోటిఫికేషన్లు గుర్తుకొస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వేరోస్‌ సభ్యులతోపాటు వివిధ పార్టీ్టలకు చెందిన కార్యకర్తలు బీఎస్పీలో చేరారు.   చదవండి: మనోళ్లకు ‘బీపీ’ ఎక్కువే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement