సాక్షి, న్యూఢిల్లీ: పెగాసస్ ట్యాపింగ్ కుంభకోణంపై కేంద్ర ఐటీ శాఖమాజీమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ఇజ్రాయెల్ స్పైవేర్ తయారీ సంస్థ ఎన్‌ఎస్‌ఓ ప్రకారం పెగాసెస్‌ను 45 దేశాలు ఉపయోగిస్తున్నప్పుడు భారతదేశం మాత్రమే ఎందుకు దాడి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాజకీయ నాయకులు, ప్రముఖ జర్నలిస్టులతో సహా భారతదేశంలో 300 మందిఫోన్లను కేంద్రం ట్యాప్ చేసిందన్న ది వైర్ కథనం మోదీ సర్కార్‌ను ఇరుకునపెట్టింది. దీంతో కేంద్ర మాజీమంత్రి కేంద్రప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే పనిలో పడ్డారు.
కాగా ఫోన్లను ట్యాప్ చేసిన ప్రముఖుల జాబితాలో కాంగ్రెస్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ , అతని ఇద్దరు సహాయకులు ఉన్నారని ది వైర్ నివేదించింది. వీరితో పాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా కూడా ఉన్నారని తెలిపింది. దీనిపై పార్లమెట్ సమావేశాల ప్రారంభం మొదటి రోజే తీవ్ర దుమారం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment